శశికళ ఎత్తుగడలపై అన్నాడీఎంకేలో కలకలం!

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా రాజకీయ సన్యాసం తీసుకోవడం ద్వారా అప్పటి అధికార పక్షం అన్నాడీఎంకేకు భారీ ఉపశమనం కలిగించిన, దిగవంత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ ఇప్పుడు తిరిగి రాజకీయంగా క్రియాశీల పాత్ర వహించేందుకు అడుగుతూ వేస్తూ ఉండడంతో ఆ పార్టీలో మరోసారి కలకలం రేపుతున్నారు. 
 
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవించి, ఎన్నికల ముందే జైలు నుండి విడుదలై వస్తూ, వస్తూ భారీ స్వాగత సన్నాహాలు  ఏర్పాటు చేసుకున్న ఆమె రాబోయే ఎన్నికలలో కీలక పాత్ర వహిస్తున్నట్లు ప్రకటించడం అప్పటి అధికార పక్షంలో అలజడి రేపింది. మరోవంక, కరోనా మహమ్మారి ఉపశమించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటన జరిపి మద్దతుదారులతో సమాలోచనలు జరిపేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలు సహితం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి రేపుతున్నాయి. 
 
అయితే ఆమె దృష్టి అంతా అన్నాడీఎంకేపై  పట్టు సాధించడమే కావడంతో, ఆమె పార్టీలోకి వస్తే తమ ఉనికి ప్రశ్నార్ధకరం కాగలదని అప్పటి ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఆందోళన చెందారు. ఇద్దరు కలిసి ఏమైనా సరే ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకొని ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 
 
దానితో ఆమె మేనల్లుడు అప్పటికే ప్రారంభించిన అమ్మ మక్కల్ మునేట్ర కజగం (ఎఎంఎంకె)లో చేరి, ఆ పార్టీతో తృతీయ కూటమి ఏర్పాటు చేసి, రాష్ట్రం అంతా పోటీ చేయనున్నట్లు సంకేతం ఇచ్చారు. దానితో ఎట్లాగైనా డీఎంకే గెలుపొందరాదని భావిస్తున్న బిజెపి ఆమె ఆ విధంగా పోటీ చేస్తే డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలి, ఆ పార్టీ ప్రయోజనం పొందగలదని ఆందోళన చెందింది. 
 
దానితో ఆమెను అన్నాడీఎంకేలో చేర్చుకోమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆ పార్టీ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు ససేమీరా అనడంతో కనీసం దినకరన్ పార్టీతో పొత్తు పెట్టుకోమన్నన్నా ఒప్పుకోలేదు. ఆమెకు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా తమ రాజకీయ మనుగడ ప్రస్నార్ధకరం కాగలదని భయపడ్డారు. 
 
శశికళను మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తున్న తుగ్లక్ సంపాదకుడు ఎస్ గురుమూర్తి సహితం తమ పత్రిక వార్షికోత్సవ సభలో, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలోనే ఆమెతో అన్నాడీఎంకే సయోధ్యకు రావాలని పిలుపిచ్చారు. అయితే ఇవేమీ కార్యరూపం దాల్చడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండమని శశికళను బిజెపి నేతలు ఒప్పించారు. 
 
దానితో `రాజకీయ సన్యాసం’ తీసుకొంటున్నట్లు అకస్మాత్తుగా శశికళ ప్రకటన ఇవ్వడం రాజకీయ వర్గాలలో ఆశ్చర్యం కలిగించి. పైగా, తమ ప్రధాన శత్రువు డీఎంకే అని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు అందరూ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
ఆమెపై నాలుగేళ్లపాటు ఎన్నికలలో పోటీచేయరాదని నిషేధం అనడంతో, ఎట్లాగూ పోటీ చేసే అవకాశం లేదని ఆమె దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఇప్పుడు 2006లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఆమెకు ఉండడం, మరోవంక డీఎంకే అధికారంలో ఉండడంతో ఈ లోగా అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడానికి ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. 
 
పైగా, ఆమెకు వ్యతిరేకంగా, బిజెపి జోక్యంతో గతంలో ఒక్కటై, గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పడిపోకుండా నడిపిన పళనిసామి, పన్నీరుసెల్వం ఇప్పుడు ఎడముఖం, పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్యెల్యేలపై, పార్టీ నేతలపై ముఖ్యమంత్రిగా పళనిసామి మంచి పట్టు సాధించారు. దానితో ప్రతిపక్ష నేతగా ఆయనే ఎన్నికయ్యారు. 
 
వాస్తవానికి పన్నీరుసెల్వం మొదట్లోనే బిజెపి అండతో, ముఖ్యమంత్రిగా అంటూ తనకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో శశికళ మొదట్లో ఆగ్రహంగా ఉండేవారు. అయితే ఎమ్యెల్యేలను సమీకరించుకొని, పన్నీరుసెల్వంను ముఖ్యమంత్రిగా దించివేసి, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే సమయంలో జైలుశిక్ష పడడంతో జైలుకు వెళ్ళవలసి వచ్చింది. 
 
ఆ సమయంలో పళనిసామిని తన మనిషిగా ముఖ్యమంత్రిగా ఆమె చేశారు. కానీ, ఆమె జైలుకు వెళ్ళగానే ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆమె మేనల్లుడు దినకరన్ ను డిప్యూటీ కార్యదర్శిగా తొలగించడమే కాకుండా, తనను పార్టీ నుండి కూడా బహిష్కరించారు. పన్నీరుసెల్వంతో రాజీపడి, తిరిగి దగ్గరకు చేర్చుకొని, తన మనుష్యులు ఎవ్వరిని పార్టీలో స్థానం లేకుండా చేశారు. 
 
అందుకనే ఆమె ప్రధానంగా పళనిసామి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అసంతృత్తిగా ఉన్న పన్నీరుసెల్వం దగ్గరకు తీసి, పళనిసామి దెబ్బతీయడం కోసం ఆమె ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు. తాను క్రియాశీల రాజకీయాలలోకి వస్తున్నట్లు ఈ మధ్యనే కొందరు మద్దతుదారులతో ఫోన్ చేసి చర్చించిన్నట్లు వార్తలు వచ్చి కలకలం రేపాయి. 
 
గత నెల చివరి వారంలో కొంత మంది నేతలతో శశికళ ఫోన్‌లో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది.  ‘‘మీరు ఆందోళనపడకండి.. ధైర్యంగా ఉండండి.. కరోనా ముగిసిన తర్వాత వస్తాను’’ అని శశికళ ఓ అన్నాడీఎంకే నేతతో ఫోన్ లో మాట్లాడినట్లు కూడా క్లిప్పింగ్ బైటకు వచ్చింది. దానికి సమాధానంగా ఆ నేత ‘‘అమ్మ మేమంతా మీ వెంట ఉంటాం’’ అంటూ భరోసా ఇచ్చారు.
 
అయితే, అన్నాడీఎంకే నేతలతో శశికళ మాట్లాడలేదని, ఎంఎమ్ఎమ్‌కే కార్యకర్తలతో ఆమె మాట్లాడారని ఎడిప్పాడి పళనిసామి కొట్టిపారేసినా, ఆమె ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతున్నది.   అన్నాడీఎంకే నుంచి తనను వేరుచేయలేరంటూ ఓ నేతతో ఆమె మాట్లాడిన ఆడియో రికార్డు కూడా బైటకు వచ్చింది.
కాగా, అన్నాడీఎంకే శాసనసభాపక్షం జూన్ 14న సమావేశం కానుంది. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, విప్‌లను ఎన్నుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికపై కూడా పళనిసామి, పన్నీర్ సెల్వం ల మధ్య అగాధం ఏర్పడినట్లు తెలుస్తున్నది. తెరవెనుక ఉంది ఈ సమావేశంపై శశికళ దృష్టి సాసరించిన్నట్లు కూడా చెబుతున్నారు. 
 సంతరించుకుంది.