అరబ్ లు ఆయుధాలు వదిలిపెడితేనే శాంతి!

ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య ఎటువంటి ఘర్షణలు జరగడం లేదని, కేవలం అరబ్ దేశాలలోనే ఉగ్రవాదులే ఘర్షణలకు కారణం అవుతున్నారని లండన్ లోని జ్యుయూష్ కౌన్సిల్ భారత్ ఉపాధ్యక్షుడు ఎజ్రా మోసెస్ స్పష్టం చేశారు. తత్వా టాల్క్స్ ఆధ్వర్యంలో ‘ఇజ్రాయిల్- పాలస్తీనా ఘర్షణలు”  గురించి జరిగిన వెబినార్ లో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇజ్రాయిల్ వారెప్పుడు యుద్దానికి తలపడలేదని స్పష్టం చేశారు. 
 
ఎప్పుడు యుద్ధం జరిగినా పాలస్తీనా వైపు నుండి ఉగ్రవాదులే ప్రారంభిస్తున్నారని, ఇజ్రాయిల్  వారు కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే తిప్పి కొడుతున్నారని తెలిపారు. ఈ మధ్య 11  రోజుల పాటు జరిగిన ఘర్షణ సహితం ఉగ్రవాదులైన హమాస్ ఇజ్రాయిల్ పౌరులపై ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా  5,000 రాకెట్ లను ప్రయోగించడంతో వాటిలో చాలావాటిని ఇజ్రాయిల్ సేనలు గాలిలోనే కాల్చివేయగా, మిగిలినవి గాజా లోని పాలస్తీనా ప్రజలపై పడి  మహిళలు, బాలలు చనిపోయారని పేర్కొన్నారు. 
 
ఎందుకు వారు అకారణంగా దాడులకు పాల్పడ్డారని మోసెస్ ప్రశ్నించారు. జెరుసలయం కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయని అంటూ ఇస్లాం పుట్టకకు 1500 సంవత్సరాల క్రితమే, మూడు వేల సంవత్సరాల క్రితమే దైవం యాదులకు జెరూసలంను ఇచ్చారని ఆయన చెప్పారు.  అయితే ఇప్పుడు అక్కడ వారు రెండు దేవాలయాలను ధ్వసం చేసి, మసీదు నిర్మించి, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని అరబ్ దేశాలను ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. 
 
అరబ్ దేశాలలో ఎక్కడ ముస్లింలు స్వేచ్ఛగా, ప్రజాస్వామియుతంగా జీవించడం లేదని పేర్కొంటూ, కేవలం ఇజ్రాయిల్ లో మాత్రమే ముస్లింలు స్వేచ్ఛగా నివసిస్తున్నారని, ఓట్లు కూడా వేస్తున్నారని గుర్తు చేశారు. హమాస్ తో ఘర్షణలు జరుగుతున్న సమయంలో కూడా ఇజ్రాయిల్ లో ముస్లింలు ప్రశాంతంగా ఉంన్నారని చెప్పారు. 
 
ఇజ్రాయిల్, పాలస్తీనాలు రెండు స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగించడానికి ఇజ్రాయిల్ అంగీకరిస్తున్నారని, పైగా ఆ దేశానికి అనేక విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నారని మోసెస్ తెలిపారు. అయితే ఇజ్రాయిల్ మనుగడను మాత్రం వారు ఒప్పుకోవడం లేదని, దానితోనే సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. 
 
నేడు క్రమంగా యుఎఇ, దుబాయి, ఈజిప్ట్, జోర్డాన్ వంటి పలు అరబ్ దేశాలు ఇజ్రాయిల్ ను గుర్తించాయని చెబుతూ, ఇజ్రాయిల్ మనుగడను గుర్తించినప్పుడే అక్కడ శాంతి  స్పష్టం చేశారు. అయితే అరబ్ దేశాలలోని ఉగ్రవాద ముఠాలు మాత్రం ఇజ్రాయిల్ మనుగడను సహింపలేక పోతున్నాయని చెప్పారు. 
 
అరబ్ దేశంలోని ఉగ్రవాద ముఠాలు కేవలం ఇజ్రాయిల్ – పాలస్తీనా ప్రాంతంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపిస్తున్నాయని భారత్ జ్యూయిష్ హెరిటేజ్ సెంటర్ అధ్యక్షుడు నిస్సిమ్ మోసెస్ తెలిపారు. ఇజ్రాయిల్ ప్రజలు ఎవ్వరికీ ముస్లింల పట్ల ఎటువంటి ద్వేషం లేదని, వారిని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదులతోనే సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తమ 
 
ఖురాన్ ను వ్రాసింది ముస్లిం కాదని, యాదు మహిళా అయిన మొహమ్మద్ భార్య అని ఆయన తెలిపారు. ఇజ్రాయిల్ ప్రజలు ఎవ్వరు పాలస్తీనాను అంతమొందించాలనై అనుకోవడం లేదని, రెండు దేశాలు కలసి శాంతియుతంగా జీవించాలని కోరుకొంటున్నారని స్పష్టం చేశారు. అయితే మా అక్క, చెల్లెలు, పిల్లలను చంపుతూ ఉంటే మౌనంగా ఉంటామా అని ప్రశ్నించారు. 
 
ముస్లిం ఉగ్రవాదులకు అరబ్ దేశాలే నిధులు సమకూరుస్తున్నాయని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని, మరోపక్క వారు శాంతి వచనాలు పలుకుతున్నాయని ఎద్దేవా  చేశారు. నేడు అరబ్ ప్రపంచంలోని ఉగ్రవాదులను కట్టడి చేయగల సామర్ధ్యం ఉన్నది కేవలం ఇజ్రాయిల్ కు మాత్రమే అనే భయంతో నేడు అరబ్ దేశాలు ఇజ్రాయిల్ తో స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. 
 
ముస్లింలలో అత్యధికులు శాంతికాముకులు అని, కానీ కొద్దిమంత్రి హింసాయుత ఘర్షణలకు పాలపడుతూ ఉంటే, వారు మౌనంగా ఉంటున్నప్పుడు ప్రయోజనం ఏమిటని నిస్సిమ్ మోసెస్ ప్రశ్నించారు. రెండు ప్రపంచ యుద్దాలు ఇటువంటి ధోరణి కారణంగానే తలెత్తాయని చెప్పారు.