
ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు ఎన్నికయ్యారు. యూఎన్ 76 వ సమావేశానికి అధ్యక్షుడిగా నియమితులైన మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ఉప ప్రతినిధిగా ఉన్న కే నాగరాజ్ నాయుడును ‘చెఫ్ డీ క్యాబినెట్’గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐక్యరాజ్యసమితిలో ఇది ఒక ముఖ్యమైన పదవి. ఐరాసలో బ్యూరోక్రసీ ‘చెఫ్ డీ క్యాబినెట్’ నియంత్రణలో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్ జల్మై రసూల్‌పై నాగరాజ్ నాయుడు ఈ పదవికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో నాయుడుకు 143 ఓట్లు లభించగా, రసూల్‌కు 48 ఓట్లు మాత్రమే వచ్చాయి.
నియామకం అనంతరం నాగరాజ్ నాయుడు ప్రస్తుత జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్కిర్‌తో భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అధ్యక్షుడి నాయకత్వంలో పనిచేసే అవకాశం తనకు లభించడం పట్ల నాగరాజ్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
కొత్త జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైన అబ్దుల్లా షాహిద్ ఈ నెల 7 న అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. సెప్టెంబరులో ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు. ‘చెఫ్ డీ క్యాబినెట్’ ఏ అంతర్జాతీయ సంస్థలోనైనా సీనియర్ బ్యూరోక్రాట్. సంస్థ ఉన్నత పదవిలో నియమితులయ్యే వారి వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేస్తారు.
More Stories
ప్రధాని మోదీకి అత్యున్నత సైప్రస్ పురస్కారం
రెండుసార్లు ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ యత్నం
అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి లక్షలాది జనం