
యెస్ బ్యాంకులో నిధుల మళ్లింపు కేసులో సీబీఐ బుధవారం దేశ వ్యాప్తంగా 14 చోట్ల సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, హైదరాబాద్, లక్నో తదితర ప్రధాన నగరాల్లో 14 చోట్ల తనిఖీలు చేసినట్లు సీబీఐ అధికార వర్గాల సమాచారం.
2017-19లో రూ.466 కోట్లకు పైగా నిధులను మళ్లించిన వైనం వెలుగులోకి రావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. యెస్ బ్యాంక్‌లో ప్రజల డబ్బు మళ్లింపునకు సంబంధించిన మరో కేసులో అవంత గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ థాపర్ ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు.
తాజాగా జరిపిన సోదాల్లో మరిన్ని ఆధారాలతో ఇంకో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. అలాగే ప్రస్తుత కేసులో రఘుబీర్ కుమార్ శర్మ, రాజేంద్ర కుమార్ మంగల్, తాప్సీ మహాజన్, వారి కంపెనీలు ఓస్టెర్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్, అవంత రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, జాబువా పవర్ లిమిటెడ్ అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆశిష్ వినోద్ జోషి 27 మే,2021 నాటి ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు మాజీ చీఫ్ రాణా కపూర్ కు సైతం సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
More Stories
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
ఎయిర్ ఇండియా బాధితులకు అదనంగా రూ.25 లక్షలు
ఎస్బిఐ వడ్డీ రేట్లు అర శాతం తగ్గింపు