పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లో అల్-ఖైదా ఉగ్రవాదులు!

అల్-ఖైదా అధినేత అమాన్ అల్-జవహరి బతికే ఉన్నాడు. అతను పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో దాక్కున్నాడు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి ఐరాస నివేదిక ప్రకారం, అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వారిలో గణనీయమైన సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్నారు.

అల్-ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహరితో సజీవంగానే ఉన్నాడు. కాని చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. అల్-జవహరి 1988 లో ఒసామా బిన్-లాడెన్ అల్-ఖైదాను స్థాపించడంలో సహాయం చేసాడు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల‌లో సంస్థ కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. బిన్ లాడెన్ మరణం తర్వాత జవహరి అల్-ఖైదాకు అధిపతిగా ఉన్నారు.

జవాహరి అనారోగ్య కారణంగా మరణించినట్లు వ‌చ్చిన‌ వార్తలను ధ్రువీకరించలేమని, అతను ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో దాక్కున్నట్లు ఆ నివేదిక పేర్కొన్న‌ది. సమీప భవిష్యత్‌లో అల్-ఖైదా వ్యూహం ఆఫ్ఘనిస్తాన్‌ను త‌మ అగ్ర ఉగ్ర‌వాదుల‌కు సురక్షితమైన స్వర్గధామంగా మార్చడం అని కూడా వెల్లడించింది. 

ఐక్యరాజ్య సమితి తన నివేదికలో ఉగ్రవాద సంస్థ దీర్ఘకాలిక వ్యూహం ప్ర‌కారం కొంతకాలం తమ‌ కార్యకలాపాలను నిలిపివేశార‌ని పేర్కొన్న‌ది. త‌ద‌నంత‌రం అంతర్జాతీయ లక్ష్యాలపై దాడి చేయాలి. అల్-ఖైదా ఈ ప్రాంతంలో కొన్ని డజన్ల నుంచి 500 మంది వరకు ఉండొచ్చున‌ని తెలిపింది. 

ఈ ఉగ్రవాదులలో ఎక్కువ మంది ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియాకు చెందినవారు. ఆఫ్ఘనిస్తాన్ శాంతి ప్రక్రియపై తాలిబాన్, అల్-ఖైదా మధ్య క్రమం తప్పకుండా సంభాషణలు ఉన్నాయని నివేదిక‌లో వెల్ల‌డించారు.