గ్రామీణ ప్రాంతాలను ఎక్కువగా కాటేసిన కరోనా రెండో వేవ్ 

కరోనా మహమ్మారి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్రంగా బహిర్గతం చేసింది. పట్టణ భారతదేశంలో సన్నద్ధత మెరుగైనప్పటికీ  గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులు క్షీణించాయి.
 
 ప్రపంచ పర్యావణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్  విడుదల చేసిన కొత్త గణాంక నివేదిక, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ “స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఇన్ ఫిగర్స్ 2021” పేరుతో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం గ్రామీణ భారతదేశంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు 76 శాతం ఎక్కువ మంది వైద్యులు, 56 శాతం ఎక్కువ రేడియోగ్రాఫర్లు, 35 శాతం ఎక్కువ ల్యాబ్ టెక్నీషియన్లు అవసరమని తెలిపారు.

ఈ నివేదిక వాయి కాలుష్యం, వాతావరణ మార్పుల నుండి జీవవైవిధ్యం, కరోనా వరకు; వ్యవసాయం, భూమి నుండి నీరు,  వ్యర్థాల వరకు అనేక అంశాలకు సంబంధించిన సమాచారం పొందుపరిచింది. సీఎస్ఇ  నిర్వహించిన ఒక వెబ్‌నార్‌లో ఈ నివేదికను సెంటర్ట డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ విడుదల చేశారు. 
 
“రెండవ వేవ్ కి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఘోరంగా దెబ్బతింది. గ్రామీణ భారతదేశం మన పట్టణ ప్రాంతాల కంటే తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది మేలో, భారతదేశంలోనే ఆరు రోజులలో రోజువారీ ప్రపంచ కేసులలో సగానికి పైగా ఉన్నాయి. గ్రామీణ జిల్లాల్లో కేసుల పెరుగుదల కారణంగా ఈ సంఖ్య బాగా పెరిగింది” అని డౌన్ టు ఎర్త్ మేనేజింగ్ ఎడిటర్ రిచర్డ్ మహాపాత్రా తెలిపారు. 
 
వాతావరణ సంబంధిత ప్రమాదాలతో పాటు, అంటు వ్యాధులు 2006 తరువాత మొదటిసారిగా ప్రధాన ప్రపంచ ఆర్థిక ముప్పుల జాబితాలోకి ప్రవేశించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి ఫలితంగా దేశంలో పేరుకుపోతున్న బయోమెడికల్ వ్యర్థాలను సూచిస్తూ, 2021 ఏప్రిల్, మే మధ్య కరోనా కారణంగా బయోమెడికల్ వ్యర్థాలలో 46 శాతం పెరుగుదల ఉందని నివేదిక పేర్కొంది. 
 
భారత దేశ జనాభాలో మే చివరకు 3.12 శాతం మంది ప్రజలు మాత్రమే రెండు విడతల టీకాలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 5.48 కన్నా తక్కువ కావడం గమనార్హం. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కలుగుతున్నది. 
 
“మహమ్మారి గ్రామీణ జిల్లాలకు వ్యాపించడం అంటే ఈ మహమ్మారి నుండి దేశం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని నివేదిక ముఖ్య రచయితలలో ఒకరైన రంజిత్ సేన్‌గుప్తా చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే ఏడాది జిడిపి వృద్ధిని మందగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మే 2021 లో పట్టణ నిరుద్యోగిత రేటు దాదాపు 15 శాతానికి చేరుకోగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో భారీగా చెల్లింపులు జరిగాయి – జమ్మూ & కాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నదని తెలిపారు.
 
ఈ నివేదిక వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించిందని : “మనం బలహీనపరిచే మహమ్మారితో ఉన్నామని  మన మనుగడకు ముప్పు కలిగించే మరో స్పష్టమైన వాతావరణ మార్పును విస్మరింపలేమని సునీతా నారాయణ్ స్పష్టం చేశారు. తమ నివేదిక డేటా ఈ ముప్పు రిమాణాన్ని బాగా వివరిస్తుందని ఆమె తెలిపారు. 

2006,  2020 మధ్య కాలంలో భారతదేశంలో 12 సంవత్సరాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక నపేర్కొంది.అత్యంత వేడి గల దశాబ్దంగా దీనిని పేర్కొనవచ్చు.  విపరీత వాతావరణ సంఘటనలు దేశవ్యాప్తంగా తమ వినాశనాన్ని కొనసాగించాయి.  ఇది విపత్తుల కారణంగా ప్రపంచంలో అంతర్గత నిరాశ్రయులు కావడంతో  ప్రపంచంలోనే ఘోరంగా దెబ్బతిన్న దేశాలలో నాల్గవదిగా భారత్ నిలిచింది.