
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకుర్ వ్యాక్సిన్ల విషయంలో రాజస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును గురువారం ట్విటర్‌లో తప్పుబట్టారు. ఎంతో శ్రమకోర్చి తాము వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటే రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు మాత్రం బ్లాక్ మార్కెట్ దందాను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ”వన్ టూకా ఫోర్ పాలసీ”ని ఆచరిస్తున్నాయని మండిపడ్డారు.
ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, అందుకే వ్యాక్సిన్ల పేరుతో రాష్ట్రాలను దోచుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. తయారీదారుల నుంచి తాయు కొనే ఒక్కో డోసును రాష్ట్రాలకు రూ. 400లకు అమ్ముతున్నామని చెప్పారు. కానీ పంజాబ్, రాజస్తాన్ ప్రభుత్వాలు అక్కడి ప్రైవేటు ఆసుపత్రులకు ఒక్కో డోసును రూ. 1060కి అమ్ముకోగా,అవి ప్రజలకు చేరే సమయానికి వాటి ధర రూ. 1500 దాటుతుందని పేర్కొన్నారు.
అలా ఆయా ప్రభుత్వాలే బ్లాక్‌మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్‌కు అత్యంత ఇష్టమైన ”వన్ టూకా ఫోర్ పాలసీ” అని ధ్వజమెత్తారు. కాగా పంజాబ్‌తో పోలిస్తే రాజస్తాన్ ప్రభుత్వం రెండు అడుగులు ముందుందన్నదని ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 11.50 లక్షల వ్యాక్సిన్లను వృధా చేశారని, అవన్నీ అక్కడి చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. అయితే వారు వ్యాక్సిన్ల వృధా పేరుతో ప్రజల్లో తమకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
ఛత్తీస్‌గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి క్లీన్ స్వీప్