రాజ్యసభకు స్వప్నదాస్ గుప్తా, మహేష్ జెట్మలాని 

ప్రముఖ జర్నలిస్ట్ స్వప్నదాస్ గుప్తా,  ప్రముఖ న్యాయవాది మహేష్ జెట్మలానీ లని కేంద్ర ప్రభుత్వం సిఫార్సుపై రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేశారు. 

రాజ్యసభ సభ్యుడైన స్వప్నదాస్ గుప్తా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యుడు ఇతర పదవులకు పోటీచేయరాదనే నిబంధన తలెత్తడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు.

ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలోనే ఆయనను తిరిగి నామినేట్ చేశారు. ఇంకా ఆయనకు మిగిలిఉన్న పదవీకాలం 2022 ఏప్రిల్ 24 వరకు ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు. 

అదే విధంగా దిగవంత మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ కుమారుడు, ప్రముఖ న్యాయవాది మహేష్ జెట్మలానిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానంలో ఆయనను నామినేట్ చేశారు. మహాపాత్రకు ఇంకా మిగిలి ఉన్న ప్రదవీకాలం 2024 జులై 13 వరకు అయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు.