మోదీ కరోనా కట్టడి ప్రయత్నాలపై 63 శాతం ప్రజల హర్షం 

మోదీ కరోనా కట్టడి ప్రయత్నాలపై 63 శాతం ప్రజల హర్షం 

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి నరేంద్ర మోదీ  నేతృత్వంలోని ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యూహాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న వారిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకరు. 

టీకా వ్యూహాన్ని ప్రభుత్వం సరిగ్గా రూపొందించక పోవడంతో భారతదేశం బహుళ కోవిడ్ తరంగాలకు గురవుతుందని ఇటీవల రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో కోవిడ్ కారణంగా చాలా మరణాలకు కేంద్రం,  ప్రధానమంత్రి ప్రత్యక్షంగా బాధ్యులని ఆరోపించారు.

అయితే, మోదీపై కాంగ్రెస్ నాయకుడు చేసిన విమర్శలు ప్రజలతో మమేకమవ్వడంలో విఫలమైనట్లు అనిపిస్తుంది.  అవకాశం ఇస్తే, రాహుల్ గాంధీ మరింత మెరుగుగా  కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోలేరని  రీతిలో నిర్వహించలేరని ఎబిపిసి ఓటరు మోడీ 2.0 రిపోర్ట్ కార్డ్ లో స్పష్టం చేశారు.

ఎబిపిసి ఓటరు సర్వే ప్రకారం, 22.8 శాతం మంది మాత్రమే  ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే,  ఆయన పరిస్థితిని చక్కగా నిర్వహించగలడని భావిస్తున్నారు.

 అయితే 63.1 శాతం మంది ప్రస్తుత పరిస్థితులలో అత్యుత్తమ రీతిలో ప్రధాని మోదీ కరోనా సంక్షోభాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. అవకాశం ఇస్తే  రాహుల్ గాంధీ ఆ విధంగా చేయగలిగేవారు కాదని స్పష్టం చేస్తున్నారు. 

పట్టణ ప్రాంతాలలో 65.8 శాతం మంది, గ్రామీణ ప్రాంతాలలో 61.9 శాతం మంది ప్రధాని మోదీ కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న తీరుతెన్నుల పట్ల ఆమోదం తెలిపారు. కేవలం 14.9 శాతం మంది మాత్రమే తాము ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. 

కరోనా విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు కురిపిస్తుండటం ద్వారా, ఈ సర్వే ప్రకారం, ఆయనను ప్రధాన మంత్రి పదవికి అర్హతగల నాయకుడిగా ప్రజలలో గుర్తింపు తేవడం గాని లేదా ఆయనే ప్రధానిగా ఉంటే మరింత మెరుగుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని ఉండేవారని ఆయన ప్రజలలో విశ్వాసం కలిగించలేక పోతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

పైగా, గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడాన్ని 68.4 శాతం మంది సమర్ధించారు