జైపూర్‌లో కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న‌

జైపూర్‌లో కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న‌

రాజస్థాన్‌లోని జైపూర్‌లో కొంత మండి కొవిడ్ నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ సోమవారం నాడు అనారోగ్యం తో మరణించిన హాజీ రఫత్ అలీ (65) అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘిస్తూ జైపూర్ లోని రాంగంజ్ సుమారు 15,000 మంది  హాజరయ్యారు. వీరంతా ఊరేగింపుగా వెళ్ళి పాల్గొన్నారు.

ఈ నెల ఎనిమిదో తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌లో లాక్ డౌన్ ఆంక్ష‌లు ఉన్నాయి. ఏప్రిల్‌లో కొవిడ్ విజృంభించ‌డంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారు.  ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐదుగురికి పైగా వ్యక్తుల సమావేశాన్ని నిషేధించారు. ఎటువంటి ఊరేగింపున‌కు అనుమతి లేదు.

అయితే, రాజస్థాన్‌ పోలీసుల ప్రకారం ఈ ఊరేగింపుకు ముందు స్థానిక ప్రజలకు కోవిడ్ నిబందనల గురుంచి వివరించే ప్రయత్నం చేసినప్పటికీ  పట్టించుకోలేదు అని ఆరోపిస్తున్నారు.  పోలీసులు అంటువ్యాధి చట్టం ప్రకారం స్థానిక ఎమ్మెల్యే రఫీక్ ఖాన్ సహా 11 మందిపై  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.