ధృతరాష్ట్రునిలా వ్య‌వ‌హ‌రిస్తున్న సోనియా

క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న రేకెత్తించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ నేత క‌మ‌ల్ నాథ్ పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ చౌహాన్ కోరారు. క‌మ‌ల్ నాథ్ వ్య‌వ‌హార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చార‌ని ఆమె ద్రుత‌రాష్ట్రుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కమల్‌ నాథ్‌ మాటలను సోనియా అంగీకరిస్తుందా అంటూ ప్రశ్నించారు.

మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి తాము చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా కాంగ్రెస్ పార్టీ అగ్గి రాజేస్తోంద‌ని ఆరోపించారు. క‌లిసిక‌ట్టుగా పోరాడాల్సిన స‌మ‌యంలో మ‌ర‌ణాల‌ను చూసి కాంగ్రెస్ ఆనందిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఓ వైపు జనాలు ప్రాణాలు కోల్పోతుంటే..కాంగ్రెస్‌ పార్టీ దాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటుందని మండిపడ్డారు.

మ‌రోవైపు క‌రోనా వైర‌స్ ఇండియ‌న్ వేరియంట్ అంటూ క‌మ‌ల్ నాథ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బిజెపి తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత‌ల ఫిర్యాదు ఆధారంగా క‌మ‌ల్ నాథ్ పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఎఫ్ ఐఆర్ న‌మోదైంది.

ఇక ఈ రోజు రాష్ట్రంలో 7000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారన్నారు. కొత్తగా 2,936 కరోనా కేసులు మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.2 కి పడిపోయిందని పేర్కొన్నారు. అయిన్పటికీ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.