
కరోనాను ముగిసిపోయే అధ్యాయంగా చూడరాదని, పునరావృత్తమయ్యే ఛాలెంజ్‌గానే చూడాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. కరోనా మహమ్మారి మానవుడి జ్ఞాపక శక్తిలో చాలా తీవ్రంగా పాతుకుపోతుందని చెప్పారు.
ప్రపంచం ప్రపంచమే కరోనాతో క్లిష్ట పరిస్థితుల్లోకి జారుకుందని, భారత్ మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి జారుకుందని పేర్కొన్నారు. ‘‘నిక్కి’’ నిర్వహించిన ‘‘ఆసియా భవిష్యత్తు’’ అన్న సెమినార్‌లో ఆయన పాల్గొంటూ ఆరోగ్యం, వైద్య అవసరాలను తీర్చడానికి ప్రపంచ దేశాలన్నీ అంతర్లీనంగా ఓ సరఫరా గొలుసుగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
సంవత్సరం కాలంగా మహమ్మారి పంజా విసరడంతో ఓ గడ్డుకాలన్నే ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. అయినా, సవాలను దీటుగా ఎదుర్కొంటున్నా, కరోనా వినాశనాన్ని కొనసాగిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచ రాజ్యాల దృష్టి మొత్తం ఆరోగ్య వ్యవస్థపైనే కేంద్రీకృతమైందని వివరించారు.
ఆసియాతో సహా మిగితా ప్రపంచ దేశాలపై దీర్ఘకాలికంగా కరోనా ప్రభావం ఎలా వుంటుందో ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నామని, మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ సహకారాన్ని కోరేంత స్థాయికి వెళ్లిపోయిందని తెలిపారు. జాతీయంగా ఎంత పెద్ద సహకారమున్నా, అది పనిచేసే స్థాయిలో లేదని, అంతర్జాతీయ సహకారం తప్పనిసరైందని జైశంకర్ స్పష్టం చేశారు.
‘‘భారత్ ప్రస్తుతం గడ్డుకాలాన్నే ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరోగ్య వ్యవస్థపైనే పూర్తి స్థాయి దృష్టిని కేంద్రీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలికంగా కరోనా ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందన్న అంచనాకు ఇంకా రాలేకపోతున్నాం. అంతర్జాతీయంగా మునుపెన్నడూ లేనంత సహకారాన్ని చేసుకోవాల్సి వస్తోంది” అని తెలిపారు.
జాతీయంగా ఎంత సమృద్ధి ఉన్నా, చాలడం లేదు. ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోడానికి రీ ఇంజినీరింగ్‌పై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందని జై శంకర్ సూచించారు.
More Stories
భారత్ ఇకపై ఉగ్రవాద బాధితురాలిగా ఉండదు
`జగన్నాథుడి’ ఒడిశాకోసం ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక