కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
గురువారం ఎమ్మెల్యేలతో నిర్వహించించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాత్రి పొద్దుపోయిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వల్ల తమ వారిని కోల్పోయిన లోటును పూడ్చ లేనిదని, ఆ బాధలలో ఉన్నవారికి కొంత ఉపషమనం కలిగించాలని నిర్ణయించామని సీఎం అన్నారు. ఇందులో భాగంగా వారికి కొంతమేరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
కరోనా బారినపడినవారిని కాపాడాలని తాము ప్రయత్నించాం. కానీ రక్షించలేకపోయాం. అందువల్ల వారిని వారి కుటుంబాలకు రూ.లక్ష నష్టపరిహారం ఇస్తుమని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎవరైన ఉద్యోగులు కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అందిస్తున్నది.

More Stories
పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం
సహనం కోల్పోయి కార్యకర్తలపై చేయిచేసుకున్న మమత
వైద్యురాలు, సిబ్బందిపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్