కొవాగ్జిన్ కు అంతర్జాతీయంగాను మంచి ఫ‌లితాలు

భారత్, ఇంగ్లాండ్ లలో  కనిపించిన కరోనా వేరియంట్లపై  కోవాగ్జిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని భారత బయోటెక్ ప్రకటించింది. ప్రస్తతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా వేరియంట్లు B.1.617, B. 1.1.7 లపై వాడితే మంచి ఫలితాలను ఇచ్చిందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జాయింట్ స్టడీలో తేలింది. 
 
దీంతో కొవాగ్జిన్ కు మరోసారి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కినట్టైందని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ లో పబ్లిష్ అయ్యాయి.

ఇక పౌల్ట్రీ వ్యాక్సిన్ ల తయారీలో పేరున్న హెస్టర్ బయోసైన్సెస్ కొవాగ్జిన్ తయారీకి ఆసక్తి చూపుతోంది. కొవాగ్జిన్ తయారీకి భారత్ బయోటెక్ తో చర్చలు జరుపుతున్నట్టు హెస్టర్ బయో సైన్సెస్ తెలిపింది. భారత్ బయోటెక్ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ ద్వారా వ్యాక్సిన్ తయారీ అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వివరించింది. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిపింది.