డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వైఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి. జార్ఖండ్‌లోని హజారిబాగ్ టౌన్‌లో శనివారం ఈ సౌకర్యం కల్పించడంతో రైల్వే 6 వేల స్టేషన్‌లలో ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నట్లు జాతీయ రవాణా సంస్థ తెలిపింది.
2016లో ముంబై రైల్వే స్టేషన్‌లో మొట్ట మొదట ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిదాన్‌పూర్ స్టేషన్‌లలో ఉచిత వై-ఫై సేవలు అందించి 5,000 మార్కును అందుకుంది. అలాగే, మే 15 న ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని జరపాడ స్టేషన్‌కు కూడా వై-ఫై సౌకర్యం కల్పించినట్లు ఆదివారం తెలిపింది.
‘డిజిటల్ ఇండియాలో కార్యక్రమం కిందదేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యం‘ కల్పిస్తున్నారు. దీని వల్ల గ్రామీణ పట్టణ పౌరుల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుంది. తద్వారా గ్రామాల్లో డిజిటల్ మీద అవగాహన పెరుగుతుంది అని అని రైల్వే శాఖ తెలిపింది.
‘భారతీయ రైల్వేలు ఇప్పుడు 6,000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నాయి‘ అని తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్‌యు రైల్‌టెల్ సహాయంతో రైల్వేలకు ఎటువంటి ఖర్చు లేకుండా స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. గూగుల్, డాట్(యుఎస్‌ఓఎఫ్ కింద), పీజిసీఐఎల్, టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ పని చేపట్టినట్లు తెలిపింది.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం