క‌రోనా సంక్షోభ సమయంలో తూర్పునావికా దళం

క‌రోనా సంక్షోభ సమయంలో తూర్పునావికా దళం
క‌రోనా సంక్షోభ సమయంలో తూర్పునావికా దళం సత్తా చాటుతోంది. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా రిపేర్ లో ఉన్న రెండు పెద్ద ఆక్సిజన్ ప్లాంట్స్ కు మరమ్మతులు చేసి ఉత్పత్తిని ప్రారంభింప చేశారు. విశాఖ నేవల్ డాక్ యార్డ్ సిబ్బంది అందులో పాల్గొన్నారు. 
 
దీంతో నెల్లూరుశ్రీకాళహస్తి లో గత ఆరు సంవత్సరాలుగా  నిరుపయోగంగా పడి ఉన్న ఆక్సిజన్ ప్లాంట్స్ కి మరమ్మతులు చేయడం ద్వారా రాష్ట్రంలోనే భారీగా ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడింది. 
 
నెల్లూరులోని కృష్ణ తేజ ఆక్సీజన్ ప్లాంట్ లో 400 జంబో రకం సిలిండర్లను ఛార్జ్ చేయగల క్రయోజినిక్ ప్లాంట్ కి మరమ్మతులు పూర్తి చేయడంతో తక్షణం ఉత్పత్తికి సిద్ధమైంది ప్లాంట్. అలాగే తిరుపతి సమీపంలో గల శ్రీకాళహస్తిలో నిమిషానికి 16000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ప్లాంట్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది నేవీ.
 
తూర్పు నావికాదళ కమాండర్ దీపాయన్ నేతృత్వంలో వారం పాటు అవిశ్రాంతంగా పనిచేసి రాష్ట్ర ఆక్సిజన్ అవసరాలను తీర్చే ప్రయత్నంలో నేవీ విజయం సాధించింది. ప్రస్తుత సమయంలో ఈ స్థాయిలో ఆక్సిజన్ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉండడం చాలా  పెద్ద రిలీఫ్ గా చూడాల్సి ఉంది. 
 
నెల్లూరుశ్రీకాళహస్తిలో గల ఈ ఆక్సీజన్ ప్లాంట్లను తూర్పు నౌకాదళం అక్కడ నుంచి ఇటీవలే ఎయిర్ క్రాప్ట్స్ లో విశాఖకు చేర్చింది.