నేరుగా నగదు చెల్లింపుతో పంజాబ్ గోధుమల సేకరణలో రికార్డు 

అంజు అగ్నిహోత్రి చాబా 
 
ఒక వంక కరోనా రెండో వేవ్ ఉధృతంగా వ్యాపిస్తుండగా, ఐదు నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతూ ఉండగా, రబి సీజన్లో గోధుమల సేకరణలో పంజాబ్ గత రికార్డులు అన్నింటిని అధిగమించింది. నిర్ణీత లక్ష్యానికి మించి 2 లక్షల టన్నుల మేరకు ప్రభుత్వం ఏజెన్సీలు మొత్తం 132.08 లక్షల టన్నుల గోధుమలను సేకరించాయి. 
 
పంజాబ్ లో మొదటి సారిగా 9 లక్షల మంది రైతులు అరహతియాలు లేదా దళారుల ప్రమేయం లేకుండా తమ ఖాతాలలో రూ 23,000 కోట్ల నగదు పొందారు. 34 రోజుల రబి మార్కెట్ సీజన్లో ఏప్రిల్ 10న ప్రారంభమై, గత ఏడాదికన్నా 12 రోజుల ముందుగానే గురువారం ముగిసింది. 
 
పంజాబ్ చరిత్రలోనే భారత ఆహార సంస్థ అత్యధికంగా ఈ ఏడాది గోధుమలను కొనుగోలు చేసింది. 2009-10 వరకు ప్రతి ఏడాది 100 లక్షల మెట్రిక్ టన్నులకన్నా తక్కువగానే కొనుగోలు చేసెడిది. తమ ధాన్యాలతో మండీలకు వచ్చిన రైతుల సంఖ్య 9 లక్షలు కూడా ఒక రెసిరోడ్. గత ఏడాది 8.8 లక్షల మంది మాత్రమే వచ్చారు. 
 
రైతుల నిరసనలకు కేంద్రబిందువైన మాల్వా ప్రాంతంలో గోధుమల సేకరణ కొంచెం తక్కువగా ఉండగా, డోబా, మాఝా ప్రాంతాలలో పెరిగింది. గత ఏడాదికన్నా తక్కువ సేకరణ జరిగిన జిల్లాల సంఖ్యకు మించి ఎక్కువ సేకరణ జరిగిన జిల్లాలే ఉండడం గమనార్హం. ఈ సంవత్సరం కొంచెం తక్కువ దిగుబడులు ఉన్నప్పటికీ సేకరణ ఎక్కువగా ఉండడం ప్రాధాన్యత సంతరింప చేసుకోండి. వాతావరణం మొత్తం మీద అనుకూలంగా ఉన్నప్పటికీ గత ఏడాది హెక్టర్ కు సగటున 50. 04 క్వింటాల్ దిగుబడి ఉండగా, ఈ ఏడాది 49 క్వింటాల్ మాత్రమే ఉంది. 

దళారుల ప్రమేయం లేకుండా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి నేరుగా నగదు చెల్లించడం గరిష్ట స్థాయిలో ధన్య సేకరణ జరగడానికి ఒక ప్రధాన కారణం అని పంజాబ్ ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ రవి భగత్ చెప్పారు. 

“ప్రభుత్వం అనాజ్ ఖరీడ్ పోర్టల్ లో రైతుల పేర్లు నమోదు చేసుకొని, దళారులకు కాకుండా వారి ఖాతాలలోకే నగదు జమ చేసింది…. డిజ్ లాకర్ లో ఒక రైతు అమ్మిన పంటలను కూడా జె ఫారం ద్వారా నమోదు చేసిన మొదటి రాష్ట్రం కూడా పంజాబ్. జె ఫారం కోసం రైతులు దళారులపై ఆధారపడకుండా చేసాము” అని వివరించారు. 

నేరుగా కనీస మద్దతు ధరను తమ ఖాతాలకు చెల్లిస్తూ ఉండడంతో రైతులు ఫ్లోర్ మిల్లులకు వెళ్లకుండా మండి లకు గోధుమలను తీసుకు రావడానికి ఒక ప్రధాన కారణం అని భారతీయ కిసాన్ యూనియన్ (దకూండా) నేత జగ్మోహన్ సింగ్ చెప్పారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలతో పాల్గొంటున్న రైతులు సహితం కనీస మద్దతు ధరకు (క్వింటాల్ రూ  1,975) తమ గోధుమలు అమ్ముకోవడం కోసం ముందుకు వచ్చారని పంజాబ్ మండి బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కరోనా కారణంగా మార్కెట్ లో ప్రైవేట్ వ్యక్తులు తక్కువగా ఉండడంతో ఎక్కువ గోధుమలను ప్రభుత్వం మండిలకు తీసుకు వచ్చారని కూడా చెప్పారు. 

ఆ విధంగా గోధుమలు అమ్మిన రైతులలో లూథియానా పర్నాథంలోని చక్ కలాన్ ఒకరు. తాను 20 ఎకరాలలో రూ 8 లక్షల పెట్టుబడితో సుమారు 400 క్వింటాల్ గోధుమలు పండించినట్లు చెప్పారు. “నగదు నేరుగా మాకు చేరే పద్ధతి నాకు చాల సంతోషం కలిగించింది. నా మొత్తం పంటను ప్రభుత్వ ఏజెన్సీ లేక్ కనీసం మద్దతు ధరకు అమ్ముకొని, గత ఏడాదికన్నా ఎక్కువ మొత్తం పొందాను” అని తెలిపారు. 

పంజాబ్ లో 35 లక్షల హెక్టార్లలో గోధుమలను పంజాబ్ రైతులు ప్రతి ఏడాది 17-18 మిలియన్ టన్నుల చొప్పున పండిస్తున్నారు. వాటిల్లో సుమారు 75 శాతం మండిలకు తీసుకు వస్తున్నారు. 

(ది ఇండియన్ ఎక్సప్రెస్  నుండి)