వర్చ్యువల్‌ పార్లమెంట్‌ సమావేశాలకై సన్నాహాలు!

కరోనా మహమ్మారి కారణంగా భౌతికంగా కలుసుకోవడం, సమావేశం కావడం ప్రమాదకారిగా మారిన సందర్భంలో ఇప్పుడు సాధారణ తరగతి గదుల నుండి అత్యున్నత దేశాధినేతల సమావేశాలు సహితం వర్చ్యువల్‌ విధానంపైనే జరుగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశాలు సహితం ఆన్‌లైన్‌ లో జరుగుతున్నాయి.
అందుచేత పార్లమెంట్ సమావేశాలు సహితం వర్చ్యువల్ పద్దతిలో జరపాలనే ప్రతిపాదన కొంతకాలంగా ముందుకు వస్తున్నది. గత సమావేశాల సందర్భంలోనే అందుకు గల సాద్యావకాశాల గురించి రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ సమాలోచనలు జరిపారు. యూకే నుంచి పాకిస్తాన్‌ వరకు అనేక దేశాల్లో వర్చ్యువల్‌ పార్లమెంట్ సమావేశాలను ఇప్పటికే నిరవహిస్తున్నారు. 
 
ఈ దిశగా మొదట స్థాయీ సంఘాల సమావేశాలు జరిపే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. తర్వాత ఇదే పద్ధతిని పార్లమెంటు సమావేశాలకు విస్తరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వర్చ్యువల్‌ పద్ధతిలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను చర్చించడానికి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు గురువారం సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.
కరోనా నేపథ్యంలో భౌతికంగా సమావేశాలు నిర్వహించడం వీలుకానందున, వర్చ్యువల్‌ విధానంలో పార్లమెంటరీ కమిటీలను సమావేశపరచాలని అనేకమంది ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ విషయం పై వెంకయ్య లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఇతర సీనియర్‌ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.
వర్చ్యువల్‌ పద్ధతిలో సమావేశాలను నిర్వహించాల ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌, మరికొందరు సభ్యులు ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. అయితే వర్చ్యువల్‌ పద్ధతిలో పార్లమెంటు సమావేశా లు నిర్వహించడానికి నిబంధనలు కొంత అడ్డొచ్చే ఉన్నట్లు చెబుతున్నారు. 
 
పార్లమెంటరీ సమావేశాలు, చర్చలకు సభ్యులు భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి. అలా గే పార్లమెంటు చర్చల గోప్యత (కాన్ఫిడెన్షియాలిటీ)కు సంబంధించిన నిబంధనలను కూడా సవరించాల్సి ఉం టుంది. ఇలాంటి సవరణలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.
 
రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలు సవరిస్తే అవి లోక్‌సభకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు భౌతికంగా సమావేశమయ్యే అవకాశం లేనందున రాజ్యాగ నిపుణులను సంప్రదించి ప్రత్యామ్నాయాలను ఆలోచించవచ్చు. ప్రతిపక్ష పార్టీలు కూడా వర్చ్యువల్‌ సమావేశాలకు సానుకూలంగా ఉన్నాయి. 
కరోనా నేపథ్యంలో గత బడ్జెట్‌ సమావేశాలను కూడా కుదించాల్సి వచ్చింది. సమావేశాలను వర్చ్యువల్‌ విధానంలో నిర్వహించాలని ఉభయ సభల్లోనూ చాలామంది కోరారు. వీరిలో అన్ని పార్టీలకు చెందిన సభ్యులున్నారు. పార్లమెంటు సమావేశాల కో సం కరోనా విషయంలో రిస్క్‌ తీసుకోలేమని స్పష్టం చే శారు.
కేసులు అధికంగా నమోదవుతున్న ఢిల్లీకి ప్ర యాణించడం, సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లాక అక్కడ క్వారంటైన్‌ నిబంధనలు పాటించడం తమ వల్ల కాదని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వర్చ్యువల్‌ సమావేశాలను ఏర్పాటుచేయాలని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌లను అభ్యర్థించారు. వీటన్నిటి నేపథ్యం లో సభాధిపతులు వర్చ్యువల్‌ సమావేశాల వైపు మొ గ్గుచూపే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రాష్ట్రాల అసెంబ్లీలు, విధానమండళ్లు కూడా వర్చ్యువల్‌ సమావేశాలను జరుపుకొనే వీలు ఏర్పడుతుంది.