బెంగాల్  హింసకు నిరసనగా అమెరికాలో ప్రదర్శనలు 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిర‌సిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని ప‌లు నగరాల్లో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేపట్టారు. దాదాపు 30 న‌గరాల్లో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగిన‌ట్లు ప్ర‌వాస భార‌తీయులు తెలిపారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని వారు డిమాండ్ చేశారు. 

ఈ ప్రదర్శనలో భారతీయ-అమెరికన్ల‌తో పాటు పెద్ద సంఖ్యలో వలస బెంగాలీలు ఉన్నారు. “హిందూ లీవ్స్ మేటర్”, “హిందూ జెనోసైడ్కు వ్యతిరేకంగా నిరసన” అని రాసివున్న‌ ప్లకార్డులను ప్ర‌ద‌ర్శించారు.

జుడాజిత్ సేన్ మజుందార్ సిలికాన్ వ్యాలీలో వ్యాపారం చేస్తుంటాడు. ఈ నిర‌స‌న‌ ప్రదర్శనకు హాజరైనప్పుడు.. తాను త‌రుచుగా బెంగాల్ వెళ్తుంటాన‌ని, అక్క‌డ ప్ర‌ణాళిక‌బద్ధంగా మార‌ణ‌హోమం జ‌రుగుతున్న‌ద‌ని విచారం వ్య‌క్తం చేశారు. ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రుగుతున్న అరాచ‌కాన్ని నిర‌సిస్తూ అమెరికాలోని 30 న‌గ‌రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తున్నాట్లు చెప్పారు.

కాగా, బెంగాల్‌లో చెల‌రేగిన హింస‌ను బ్రిటన్ సహా అనేక ఇతర దేశాలు కూడా ఖండించాయి. హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తు జ‌రుపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

 హూస్టన్‌లో నివసించే రచయిత సహానా సింగ్ తాను కోల్‌కతాలో పెరిగానని , ఎన్నికల తరువాత బెంగాల్‌లో దేశ విభజన సమయంలో జ‌రిగినంత హింస చోటుచేసుకున్న‌ద‌ని గుర్తుచేశారు.