హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత ఉద్యోగం 

పాకిస్తాన్ లో తొలిసారి ఓ హిందూ యువతి ఆ దేశంలోని అత్యున్నత పదవిని అధిష‍్టించనుంది. ఆ దేశ అత్యున్నత ఉద్యోగానికి ఎంపికై అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఆ దేశంలో ఓ హిందూ యువతి ఆ బాధ్యత చేపట్టడం ఇది తొలిసారి.  ఆమెనే పాక్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్‌ జిల్లాకు సనా రామ్‌చంద్‌.

మన దేశంలో సివిల్స్‌ మాదిరి పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (పాస్‌). సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీస్‌ (సీఎస్‌ఎస్)లో హిందూ యువతి సనా రామ్‌చంద్‌ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (పాస్‌)కు ఎంపికైంది. అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. 

ఈ సీఎస్‌ఎస్‌ పరీక్షను 18,553 మంది రాయగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. కేవలం 2 శాతం మంది మాత్రమే ఉట్టెర్న్త సాధించగా వారిలో 77 మంది బాలికను ఉన్నారు.  ఈ పరీక్షల్లో సనా రామ్‌చంద్‌ ప్రతిభ కనబర్చడంతో ఆమె పాక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు ఎంపికైంది. అంటే మనదేశంలో ఐఏఎస్‌ మాదిరి. 

సనా వృత్తిరీత్యా వైద్యురాలు కూడా. సింధ్‌ ప్రావిన్స్‌లోని చంద్కా వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం సింధ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరాలజీలో ఎఫ్‌సీపీఎస్‌ చదువుతున్నది. సర్జన్‌ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.

మొత్తం జిల్లాలో సివిల్ సర్వీస్ కు ఎంపికైన బాలిక ఆమె ఒక్కరే కావడం గమనార్హం.  ఆమె తల్లితండ్రులకు నలుగురు ఆడపిల్లలు. అందరు ఉన్నత విద్య అభ్యసించిన వారే. ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా, మరొకరు ఎంబిఎ. ఇంకొకరు మెడిసిన్ చదువుతున్నారు. 

ఒక ప్రభుత్వ అధికారిగా తన ఉద్యోగాన్ని నిజాయతీతో, సమర్ధవంతంగా చేపట్టడం ద్వారా స్థానిక హిందువులలో విశ్వాసం నింపాలని భావిస్తున్నట్లు సనా చెప్పారు. స్థానిక హిందువులు ఎక్కువగా డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని కోరుకొంటున్నారని, వారికి పరిపాలన వ్యవస్థలో కూడా మంచి అవకాశాలున్నాయని నిరూపించ దలచిన్నట్లు ఆమె పేర్కొన్నారు. 

సింధులో 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. వీరిలో బాలికలు ఎక్కువగా విద్య, ఆరోగ్యంలలో ఉద్యోగాల కోసం ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటె, ఈ మధ్య కాలంలో న్యాయవ్యవస్థ, పోలీస్ విభాగాలలో ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.