నలుగురు పిల్లలతో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ

గుంటూరు: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉండగా గుంటూరు జిల్లా కొల్లిపర వైసీపీ అభ్యర్థిని అనర్హురాలిగా ప్రకటించాలని ఫిర్యాదు దాఖలైంది.

కొల్లిపర  జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ సామజిక వర్గానికి చెందిన మహిళల కోసం కేటాయించారు. ఈ స్థానం నుండి వైసీపీ తరఫున కత్తెర హెనీ క్రిష్టినా పోటీ చేయగా, బీజేపీ నుండి మండ్రు సరళ కుమారి పోటీ చేశారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండరాదు అని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ చట్టంలోని సెక్షన్ 19(3) కింద నిబంధన ఉంది. ఐతే వైసీపీ నుండి పోటీ చేసిన కత్తెర హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారని, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఇద్దరు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారని మండ్రు సరళ కుమారి ఆరోపించారు. కత్తెర హెనీ క్రిష్టినా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున పోటీ చేసారని, ఆ సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన పిల్లల పేర్లు కనీసం ప్రస్తావించలేదు అని సరళకుమారి గుర్తుచేశారు.

అంతే కాకుండా, కత్తెర హెనీ క్రిస్టినా క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అని, అందువల్ల కొల్లిపర ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుండి పోటీ చేయడానికి కూడా అనర్హురాలేనని మండ్రు సరళ కుమారి తెలిపారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కత్తెర హెనీ క్రిష్టినా భర్త సురేష్ కుమార్ ‘హార్వెస్ట్ ఇండియా’ అనే అంతర్జాతీయ క్రైస్తవ సంస్థకు అధ్యక్షుడిగా ఉండటంతో పాటు, భార్యాభర్తలిరువురూ తమ సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున క్రైస్తవ మతప్రచార కార్యకలాపాల్లో పాల్గొంటున్న విషయాన్ని సరళకుమారి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.

1950 నాటి రాష్ట్రపతి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులు ప్రకారం ఎస్సీ సామాజిక‌ వ‌ర్గానికి చెందిన వ్యక్తి  హిందూమతాన్ని వీడి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరించినట్లైతే ఆ వ్యక్తికి ఇకపై ఎస్సీ హోదా వర్తించదు.  ఈ మేర‌కు కాథెరా హెనీ క్రిస్టినా ఇకపై ఎస్సీ హోదాను కలిగి ఉండదు కాబ‌ట్టి ఆమెకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అర్హత ఉండ‌ద‌ని సరళకుమారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదే విష‌యంపై గతేడాది జూలై 15 న ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షన సమితి గుంటూర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు కాథెరా హెనీ క్రిస్టినా, కాథెరా సురేష్ కుమార్‌లపై ఫిర్యాదు చేశారు. క్రైస్త‌వ మ‌తానికి చెందిన వీరు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ ప్ర‌యోజ‌నాల‌కు పొందుతున్నార‌ని వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌మితి  కోరింది.

అంతే కాకుండా సురేష్ కుమార్ అంతర్జాతీయ వేదికలపై భార‌త ప్రధాని న‌రేంద్ర‌మోడీపై వ్యక్తిగత దూష‌ణ‌ల‌కు పాల్పడిన‌ట్టుగా కూడా ఆధారాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 2018లో అమెరికాలోని బయోలా విశ్వవిద్యాలయంలో జరిగిన మిషన్ కాన్ఫరెన్స్ లో సురేష్ కుమార్ మాట్లాడుతూ  “ప్రస్తుతం  మేము హిందూ పాలనలో ఉన్నాం, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దేశంలో క్రైస్తవులు ఉండ‌టాన్ని ఇష్టప‌డ‌డు. భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలనుకుంటున్నారు. గత 5 సంవత్సరాలలో చాలా మంది పాస్టర్లు చంపబడ్డారు. చాలా మిషనరీలను, వాటికి చెందిన పాస్ట‌ర్ల‌ను నిషేదిస్తున్నారు. అశాంతి, గందరగోళాన్ని సృష్టిస్తూ చర్చిలను కూల్చివేస్తున్నారు. అంటూ హిందూ మ‌తంపై ద్వేషాన్ని వెల్ల‌గ‌క్కుతూ, భార‌త ప్ర‌ధాని ప్ర‌తిష్ట‌ను కించ‌ప‌రిచేలా ప్ర‌సంగం చేశాడు.

ఈ విష‌యాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్‌.ఆర్‌.పి.ఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. అమెరికాలో భార‌త‌ ప్రభుత్వాన్ని, హిందువులను కించపరిచేలా ప్ర‌సంగాలు చేయ‌డం వ‌ల్ల వారి అసహనం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని తెలిపింది. విదేశీ నిధులతో మతమార్పిళ్లకు పాల్పడుతున్న ‘హార్వెస్ట్ ఇండియా’ సంస్థ ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద విదేశీ నిధుల కోసం పొందిన లైసెన్స్ రద్దు చేయాలని హోంశాఖను కోరింది. ప్రస్తుతం ఈ అంశం హోంశాఖ దర్యాప్తులో ఉంది.