
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్ (94) అనారోగ్యంతో కన్నుమూశారు. 1927 సెప్టెంబరు 25వతేదీన జన్మించిన జగ్‌మోహన్ ఐఎఎస్ అధికారిగా పలు కీలక పదవులు నిర్వర్తించారు. జమ్మూకశ్మీరు, గోవా గవర్నరుతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా కూడా పనిచేశారు.
1984 నుంచి 1989 వరకు,1990 జననరి నుంచి మే వరకు జగ్ మోహన్ జమ్మూకశ్మీర్ గవర్నరుగా పనిచేశారు. 1996వ సంవత్సరంలో జగ్ మోహన్ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర పట్టణాభివృద్ధి, పర్యాటక శాఖల మంత్రిగా పనిచేశారు.
జగ్ మోహన్ చేసిన సేవలకు గుర్తింపుగా అతనికి 1971లో పద్మశ్రీ, 1977లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది.
స్వల్ప అనారోగ్యానికి గురైన జగ్ మోహన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జగ్ మోహన్ పరిపాలనా దక్షుడని, ఆయన లేని లోటు దేశానికి తీరనిదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. జమ్మూ, కాశ్మీర్ గవర్నర్ గా ఆయన అందించిన అపూర్వమైన సేవలకు ఆయన ఎల్లప్పుడు గుర్తింది పోతారని హోమ్ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
More Stories
దక్షిణాది బలోపేతం కాకుండా ‘వికసిత్ భారత్’ సాధ్యం కాదు
విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం తోనే తొక్కిసలాట
వేలాదిమంది గంగాజలం సేకరణతో కన్వర్ యాత్ర ప్రారంభం