కరోనాతో ఇప్పటికే పలువురు నాయకులు మరణించగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి(69) కన్నుమూశారు. ఏప్రిల్ 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. వైద్యుల సూచన మేరకు వైజాగ్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. హరికి ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. మొత్తానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
సబ్బం హరి మృతిపట్లు ఆంధ్రప్రదేశ్ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సబ్బం హరి విశాఖ మేయర్‌గా, అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీగా సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఎంపీ సబ్బం హరి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఈ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
More Stories
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం
తిరుపతి తొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
వీర జవాన్ కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు