ఏపీలో ఎల్లుండి నుంచి పగలు క‌ర్ఫ్యూ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు దుకాణాల‌కు అనుమ‌తి ఇచ్చింది. 

ఆ త‌ర్వాత క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. రెండు వారాల పాటు ఈ క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంది. నిన్న ఒక్క‌రోజే 23,997 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో.. క‌రోనా ఉధృతిని త‌గ్గించేందుకు ప‌గ‌టి క‌ర్ఫ్యూ అమ‌లుకు ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.