అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

అసోంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ ధీమా వ్యక్తం చేశారు. పోల్ ట్రెండ్స్‌ను బట్టి బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోనున్నట్టు  తేలుతోందని తెలిపారు. 
 
యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ (యూపీపీఎల్)తో కలిసి అసోంలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ”ప్రజల మద్దతు బీజేపీకి ఉందనడాన్ని ఫలితాలు సూచిస్తున్నాయి. పోలింగ్ పూర్తయ్యేంత వరకూ వేచిచూడాల్సి ఉంది” అని పేర్కొన్నారు. 
 
‘ట్రెండ్స్‌ను బట్టి ప్రజలు మావైపే ఉన్నట్టు తేలుతోంది” అని సోనోవాల్ చెప్పారు. 126 సీట్లలో కౌంటింగ్ జరుగుతోంది. కాగా, మధ్యాహ్నం 2 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్‌ను బట్టి మజులి నియోజకవర్గం నుండి పోటీ చేసిన సోనోవాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాజీబ్ లోచన్ పెగు కంటే లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీ 78 సీట్లు, కాంగ్రెస్ 47 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి.
 బీజేపీకి వ్యతిరేకంగా జట్టకట్టిన కాంగ్రెస్, సీపీఐఎం, ఏఐయూడీఎఫ్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి.