ఉప్పల్ లో సేవాభారతి  కొవిడ్‌ ఐసోలేషన్‌  కేంద్రం 

ఉప్పల్ లో సేవాభారతి  కొవిడ్‌ ఐసోలేషన్‌  కేంద్రం 
కొవిడ్‌ రోగుల  కోసం తన వంతుగా సహాయం అందించి ఉదారతను చాటుకున్నారు మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు డాక్టర్‌ మేకల శిల్పారెడ్డి. 
 
ఆర్‌ఎ్‌సఎస్‌ సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌ అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యాలయ కేంద్రలో 200 పడకల కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రానికి శిల్పారెడ్డి బీజేపీ నాయకురాలిగానే కాకుండా ఓ డాక్టర్‌గా తన అస్పత్రి ద్వారా సంపూర్ణ సహకారాన్ని అందించారు.
 
ఉప్పల్‌లోని శ్రీధ పిల్లల అస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న తన ఆస్పత్రి నుంచి రోగులకు కావాల్సిన పడకలతో 14 బెడ్స్‌తో పాటు, వైద్య బృందాన్ని పంపించారు.
 
గురువారం అన్నోజిగూడలో ఐసోలేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన వంతుగా కొవిడ్‌ సెంటర్‌కు సాధ్యమైనంతమేరకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.