ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బురఖా ధరించి చర్చ్‌లు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడి వందల ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘోరకలి ఒక్క శ్రీలంకనే కాదు.. యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
శ్రీలంకలో జరిగిన ఈ వరుసల దాడుల్లో సుమారు 270 మందికి పైగా మరణించిగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. అందుకే ఆ దేశ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది.
కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. ఈ విషయాన్ని కేబినెట్ ప్రతినిథి రాంబుక్వెల్లా మీడియాకు తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
More Stories
2050 నాటికి అగ్రరాజ్యాలుగా భారత్, అమెరికా, చైనా
ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్
ఇరాన్ సీక్రెట్ సర్వీస్ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారి