రెండు రోజులుగా వరుస భూకంపాలతో ఈశాన్య రాష్ట్ర అసోం చిరుగుటాకులా వణికిపోతోంది. బుధవారం రాత్రి వరకు సుమారు 13 సార్లు భూమి కంపించింది. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్‌పూర్‌లో ఆరుసార్లు భూకంపాలు నమోదయ్యాయి.
స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. మొదట అర్ధరాత్రి 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఆ తర్వాత 1.10 గంటలకు 2.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మళ్లీ 1.10 గంటలకు, ఆ తర్వాత 1.20 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.6 మాగ్నిట్యూడ్‌తో భూమి కంపించి. 1.41 గంటలకు మరోసారి 2.3, అనంతరం 1.52 గంటలకు 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రికార్డయ్యాయి.
చివరి సారిగా 2.38 గంటలకు 2.7 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. మరోసారి వరుసగా భూకంపాలు రావడంతో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు రోజులుగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
రెండు రోజులుగా వరుస భూకంపాలతో ఈశాన్య రాష్ట్ర అసోం చిరుగుటాకులా వణికిపోతోంది. బుధవారం రాత్రి వరకు సుమారు 13 సార్లు భూమి కంపించింది. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్‌పూర్‌లో ఆరుసార్లు భూకంపాలు నమోదయ్యాయి. స్వల్పం
గా ప్రకంపనలు వచ్చాయి. మొదట అర్ధరాత్రి 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఆ తర్వాత 1.10 గంటలకు 2.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మళ్లీ 1.10 గంటలకు, ఆ తర్వాత 1.20 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.6 మాగ్నిట్యూడ్‌తో భూమి కంపించి. 1.41 గంటలకు మరోసారి 2.3, అనంతరం 1.52 గంటలకు 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రికార్డయ్యాయి.
చివరి సారిగా 2.38 గంటలకు 2.7 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. మరోసారి వరుసగా భూకంపాలు రావడంతో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు రోజులుగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
More Stories
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!
విశ్లేషణ కోసం విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్