ఢిల్లీలో ఇకపై లెఫ్టినెంట్ గవర్నర్ పాలన! కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన కేంద్రం 

ఢిల్లీలో ఇకపై లెఫ్టినెంట్ గవర్నర్ పాలన! కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన కేంద్రం 

Lieutenant Governor of Delhi Anil Baijal

ఢిల్లీ పరిపాలన బాధ్యతలు లెఫ్టినెంట్ గవర్నరుకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) చట్టం 2021’ని అమలులోకి తీసుకువచ్చింది. 
 
నూతనంగా అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ఇకపై ఢిల్లీ ప్రభుత్వం  ఇకపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 2021 మార్చి 22న ఈ బిల్లు లోక్సభలో, 24న రాజ్యసభలో ఆమోదముద్ర పడింది. 
 
కరోనా రెండో దశ ఉధృతి సమయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, అమలు పరచడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నకేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.