ఏపీలో కీల‌క నిర్ణ‌యం

క‌రోనాను విజృంభ‌ణ ను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. ఒక‌టి నుంచి తొమ్మిది త‌ర‌గ‌తులు దాకా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది. ఈ విద్యార్థుల‌ను నేరుగా త‌దుప‌రి త‌ర‌గ‌తిలోకి ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అంతే గాకుండా పాఠ‌శాల‌ల వేళ‌ల‌ను ప‌క్క‌కు పెట్టింది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తుల‌కు మాత్రం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ, సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు జ‌రుపుతామ‌ని పేర్కొంది.