జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ స్వీకరించిన సీబీఐ కోర్టు

ఏపీ సీఎం వై ఎస్  జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్లను సీబీఐ నమోదు చేసిందని పిటిషన్‌లో రఘురామకృష్ణరాజు  పేర్కొన్నారు. ప్రతిచార్జ్‌షీట్‌లోనూ జగన్‌ ఏ-1గా ఉన్నారని, త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేయాలని కోరారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. 22న  కేసు విచారణకు రాబోతుందని చెప్పారు.

ఐఏఎస్ అధికారుల ఏసిర్ రిపోర్టును స్వయంగా ముఖ్యమంత్రి రాస్తా అనడం వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే. అధికారులను తన అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి తన కేసులో వారి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధానికి లేఖ రాశా.. త్వరలో పీఎంవో కార్యాలయం స్పందిస్తుందని భావిస్తున్నా అని త్లెఇపారు.

“రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు మన రాష్టంలో అమలు కావడం లేదు.  కొంతమంది సీబీఐ అధికారులకు ఫ్లాట్స్ కూడా కొనిస్తున్నారు. తిరుపతిలో 50 వేల మెజారిటీ కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము చెప్పిన మెజారిటీ రాకపోతే గెలిచినా వేస్ట్” అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభ పెట్టినా మెజారిటీ రాదనే  సభ పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని గుర్తు చేశారు.