ఐపిఎల్‌ మహా సంగ్రామం నేటి నుంచే 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ారాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల చెన్నై వేదికగా జరిగే తొలిమ్యాచ్‌తో ఈ సీజన్‌ ఐపిఎల్‌ మహా సంగ్రామం ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో ఈసారీ మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేదు.
 
ముంబయిలో కరోనా ఉధృతంగా ఉన్నా.. అక్కడి ప్రభుత్వం ఐపిఎల్‌ మ్యాచ్‌లకు అనుమతివ్వడంతో షెడ్యూల్‌ ప్రకారమే సీజన్‌ా14 టోర్నీ జరగనుంది. కేవలం ఆరువేదికలైన చెన్నై, ముంబయి, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులలోనే టోర్నీమొత్తం మ్యాచ్‌లు జరగనున్నాయి.
 
తొలి లీగ్‌ మ్యాచ్‌లు మే 9నుంచి 25వరకు చెన్నై, ముంబయిలలో చెరో 10 మ్యాచ్‌లు చొప్పున మొత్తం 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. 26నుంచి మే8వరకు అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికగా చెరో 7 చొప్పున మొత్తం 14 మ్యాచ్‌లు, ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లు కోల్‌కతా, బెంగళూరు వేదికలుగా 10చొప్పున మొత్తం 20 మ్యాచ్‌లు జరుగుతాయి. 
 
మే 25నుంచి 30వరకు అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాకౌట్‌ మ్యాచ్‌లతో టోర్నీ ముగియనుంది. ముంబయి జట్టు ఈ ఏడాది కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. గత సీజన్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గి రికార్డుస్థాయిలో ఐదోసారి టైటిల్‌ గెలిచి ముంబయిజట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ గురువారం నెట్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో ముంబయి తలపడనుంది. 

 
క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న 33ఏళ్ల పొలార్డ్‌ తొలిసారి నెట్స్‌లో సాధన చేశాడు. విండీస్‌ హార్డ్‌హిట్టర్‌ కొట్టిన షాట్లతో కూడిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ గురువారం ట్విటర్లో షేర్‌ చేసింది. ‘బిగ్‌ మ్యాన్‌.. బిగ్‌ హిట్స్‌.. బిగ్‌ మ్యాచ్‌ విన్నర్‌’ అంటూ ట్వీట్‌ చేసింది.