పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఆయిల్ రిగ్గులు

చమురు నిల్వల వెలికితీతకోసం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ణానంతో ఆయిల్ రిగ్గులను తయారు చేసిన భారత్ అంతర్జాతీయంగా తన సత్తా చాటుకుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గులను మేఘా సంస్థ రూపొందించింది. అత్యంత అధునాతన టెక్నాలజీతోపాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీన్ని రూపొంచింది. 

దేశీయంగా చమురు ఉత్పత్తులను పెంచి, విదేశాలనుంచి చమురు దిగుమతుల ను తగ్గించటం ద్వారా దేశీయ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ఈ అధునాతన రిగ్గులు ఎంతగానో దోహదపడనున్నాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని కల్గొల్ చమురు క్షేత్రంలో బుధవారం ఈ రిగ్గు ద్వారా డ్రిల్లింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఎంఇఐఎల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

1500 హెచ్‌పి సామర్ధంతో తయారుచేసిన ఈ అధునాతన డ్రిల్లింగ్ యంత్రం భూ ఉపరితలం నుంచి 4000 మీటర్లు (4 కిలోమీటర్లు)లోతు వరకూ చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఇఐఎల్ సంస్థ తాను రూపొంచిందిన సాంకేతిక పరిజ్ణానం ద్వారా ఈ రిగ్గును 40 ఏళ్లపాటు పనిచేసేలా తయారు చేసింది. 

రూ.6 వేలకోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్‌ను ఈ సంస్థ 2019లో ఒఎన్‌జిసి నిర్వహించిన టెండర్లలో పోటీ పడి దక్కించుకుంది. అందులో భాగంగానే మొదటి రిగ్గును ఆహ్మదాబాద్‌లోని చమురు క్షేత్రంలో వినియోగంలోకి తెచ్చింది. మిగిలిన 46రిగ్గుల తయారీ వివిధ దశ ల్లో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారి ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు.

మొత్తం రిగ్గుల్లో అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తిస్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతోపాటు చమురు బావులను రిపేర్లు చేయడానికి ఉపయోగపడే 20 వర్కోవర్ రిగ్గులు, భూ ఉపరితలం నుండి భూగర్బంలో ఆరు వేల మీటర్లవరకూ వెళ్లి భూగర్భ పొరల్లోని చమురు నిక్షేపాలను వెలికితీసే మరో 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు ఉన్నాయి. 

వర్కోవర్‌లోని 20 రిగ్గుల్లో 50 ఎంటి సామర్ధ్యం కలిగిన 1 2ఆటో మేటెడ్‌వి కాగా, మరో నాలుగు 100 ఎంటి సామ ర్ధం కలిగినవి, మరో నాలుగు 150 ఎంటి సామర్ధం కలిగిన రిగ్గులను ఎంఇఐఎల్ సంస్థ తయారు చేస్తోంది. ఇక 27ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గుల్లో ఒక్కొక్కటీ 1500 హెచ్‌పి సామర్ధ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులుకాగా, ఒక్కొక్క టి 2000 హెచ్‌పి సామర్ధంతో తయారు చేస్తున్నారు. 

భూగర్భంలోకి ఆరు కిలోమీటర్లలోతు వరకూ వెళ్లి చమురు నిక్షేపాలను వెలికితీయగల సామర్దం కలిగినవి ఈ తరహా రిగ్గులు దేశంలోనే తొలిసారి తయారవుతున్నాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గుల్లో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చములు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉన్నాయి. మిగిలినవాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఒఎన్‌జిసికి చెందిన చమురు క్షేత్రాలకు అందించనున్నారు.

ఆహ్మదాబాద్ సమీపంలోని కల్గొల్ క్షేత్రంలో దామసన గ్రామంలో ఉన్న చమురుబావి కెఎల్‌డిడిఎక్స్‌ను స్వేదే శీ పరిజ్ణానంతో తయారుచేసిన మొదటి రిగ్గుద్వారా తవ్వకాలు ప్రారంభించినట్టు ఎంఇ ఐఎల్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ రిగ్గు చమురు బావులను వేగం గా తవ్వటంతోపాటు తక్కువ విద్యుత్‌తో పనిచేస్తుంది.

భద్రతా ప్రమాణాల దృష్టా కూడా ఇది అత్యాధునికమైనదే కాకుండా ఎంతో సురక్షితమైనదని తెలిపారు. మేకిన్ ఇండియా ప్రేరణ ద్వారా అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందిన ఈ రిగ్గులను దేశంలోని నవరత్న కంపెనీ ల్లో ఒకటైన ఒఎన్‌జిసికి కంపెనీకి అందచేయటం తమ సంస్థకు ఎంతో గర్వకారణం అని రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.

విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో రిగ్గులు తయారు చేసిన ఘనత మేఘా సొంతం చేసుకుందని, ఇది తమ ససంస్థకే కాకుం డా దేశం మొత్తం గర్వించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. చమురు వెలికితీతలో విదేశీ రిగ్గులపై ఆధారపడే కంపెనీలకు మెఘా కృషి ఒక ఆశాకిరణంగా మారిందని తెలిపారు.

ఒఎన్‌జిసికి కూడా అధునాతన టెక్నాలజీ రిగ్గుల ద్వారా ఎంతోలాభం చేకూరుతుందని చెప్పారు. చమరుబావులను డ్రిల్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్షంతో ముందుకు వెళుతున్నట్లు మేఘా వస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.