వివేకా హత్య వెనుక బంధువులే ఉన్నారు 

మాజీ  మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక బంధువులే ఉన్నారని తెలుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.  వైఎస్ వివేకానందారెడ్డిని గొడ్డలి పోటు పొడించింది ఎవరు? అని ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డిని ప్రశ్నించారు.

 ఆ వైద్యులు ఎవరో తేలాలని వైసీపీ సర్కారును నిలదీశారు. హత్య సమాచారం రాగానే అక్కడి సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం మాట్లాడారు? అని నిలదీశారు. పార్లమెంట్‌లో కూడా వివేకా హత్య విషయం ప్రస్తావిస్తానని రఘురామ స్పష్టం చేశారు. 

 కాగా, తనపై కేసులు పెట్టాలని సీఎం జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ కలిసి.. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌పై ఒత్తిడి తెస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరొ వంక, సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని పీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపారు.

ఇన్ని ఛార్జిషీట్లు వేసినా… ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతోంని, ఆయన త్వరగా కేసుల నుంచి బటయపడాలనే ఈ కేసు వేశానని పేర్కొన్నారు. త్వరగా కేసు తేలిపోతుందని నమ్ముతున్నానని తెలిపారు. 

ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టు తలుపుతట్టానని చెప్పారు. కోర్టుకు వెళ్లకపోవడం… అనుమానించే విధంగా ఉన్నాయని తెలిపారు.  ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని హితవు చెప్పారు.