కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకున్నది. ఎలాగైనా ఆ ఘటనకు దీటైన జవాబిచ్చి తీరాలని నిర్ణయించింది. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా ఉన్నట్లుగా ఉప్పందించి భద్రతా బలగాలను మావోయిస్టులు ట్రాప్ చేసినందువల్ల.. ఇప్పడు భద్రతా బలగాలు అదే హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్‌కు సన్నద్ధమయ్యాయి.
హిడ్మాతోపాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహర్-3’ చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
దాంతో కేంద్ర భద్రతాబలగాలు ‘మోస్ట్‌వాంటెడ్’ జాబితాను రూపొందించాయి. అందులో మావోయిస్టు టాప్ కమాండర్‌తోపాటు మరో ఎనిమిది మంది కీలక కమాండర్ల పేర్లను పొందుపర్చాయి. అదేవిధంగా యువతను నక్సలిజం వైపు మళ్లిస్తున్న వ్యక్తులను కూడా గుర్తించాలని కేంద్ర హోంశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
దండకారణ్యంలో మావోయిస్టు నేతలందరూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చెందినవారే ఉండేవారు. దానితో వారిని ‘బయటివారు’ అంటూ స్థానిక గిరిజన దళాలతో వేరుచేసి, ఏరివేయడం భద్రతా దళాలకు తేలికగా ఉంటూ ఉండెడిది. అయితే స్థానిక గెరిజన తెగ నుండి నాయకత్వ స్థాయికి ఎదిగిన మొదటి దాడుల వ్యూహంలో మేటిగా పేరొందిన యువకుడు హిద్మా. మావోయిస్టుల పలు దాడులలో కీలక పాత్ర వహించాడు. అసలు బ్రతికి ఉన్నదా అన్నది కూడా అనుమానమే. అతని పేరుతో పలువురిని రంగంలోకి దింపారా అనే కధనాలు కూడా ఉన్నాయి.
హిడ్మాతో పాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
‘నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను ముమ్మరం చేయండి. మానవ మేధస్సుతో పాటు సాంకేతికతను కూడా బాగా వాడండి. మిగతా భద్రతా సంస్థలు కూడా సహాయం చేస్తాయి’ అని అమిత్‌షా అన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు ‘మోస్ట్‌వాంటెడ్’ జాబితాను రూపొందించింది. అందులో మావోయిస్ట్ టాప్ కమాండర్‌తో పాటు మరో ఎనిమిది మంది జాబితాను రూపొందించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది.
హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తోంది. పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు.
ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్‌పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్‌ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ..
- 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.
- 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లుమృతి చెందారు.
- 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.
- 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు.
- 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం