
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో మంగళవారం తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్ నిర్థారణ అయిందని సోషల్ మీడియా వేదికగా కత్రినా స్వయంగా వెళ్లడించారు.
దీంతో తాను హోంక్వారంటైన్ లో ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని ఆమె కోరారు.
తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కరోనా పట్ల అందదరూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించవద్దని ఆమె సూచించారు.
More Stories
48 గంటల్లో సాంకేతిక లోపాలతో 8 విమానాల ల్యాండింగ్
సింధూనదిమిగులు జలాలు తరలించాలని భారత్ యత్నం
సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్