పదహారేండ్ల బాలికను వలలో వేసుకునేందుకు తన పేరు మార్చుకుని హిందువునని చెబుతూ ఆమెతో ఢిల్లీకి ఉడాయించిన యువకుడి(25)ని యూపీ పోలీసులు లవ్ జిహాద్ చట్టం కింద అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పెంటర్‌గా పనిచేసే అమ్రోహ జిల్లాకు చెందిన యువకుడు అప్జల్ తాను హిందువునని తన పేరు ఆర్మాన్ కోహ్లీగా చెబుతూ మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో గతవారం బాలికను తీసుకుని ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేసి బాలికను కాపాడారు. ఇద్దరినీ ఆదివారం పోలీసులు ఢిల్లీ నుంచి అమ్రోహకు తీసుకువచ్చారు.
అప్జల్ తన మతం వివరాలను దాచి హిందువుగా చెప్పుకుంటూ ఆర్మాన్ కోహ్లీ పేరుతో తనతో పరిచయం పెంచుకున్నాడని బాలిక వెల్లడించింది. తనను మతం మారాలని తనపై అప్జల్ ఒత్తిడి తీసుకువచ్చాడని తెలిపింది. బాలికను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించగా నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్