ఛ‌త్తీస్‌గ‌ఢ్ న‌క్స‌ల్స్ దాడిలో 22కు చేరిన మృతులు 

ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ స‌రిహ‌ద్దుల్లో శ‌నివారం భ‌ద్ర‌తాసిబ్బందిపై జ‌రిగిన న‌క్స‌ల్స్ దాడిలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. శ‌నివారం రాత్రి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం న‌క్స‌ల్స్ దాడిలో మొత్తం ఐదుగురు భ‌ద్ర‌తాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా అందులో ఇద్ద‌రు, గాయ‌ప‌డిన 31 మందిలో 16 మంది, గ‌ల్లంతైన 21 మందిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.

43 మంది జవాన్లు గాయపడ్డారు. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ కాల్పులతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రలో యుద్ధ వాతావరణం నెలకొంది.  రెండు వేల మంది జవాన్లు , వెయ్యి మంది మావోయిస్టుల మధ్య ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి మావోయిస్టు గెరిల్లా ఆర్మీ గుట్టలపై నుంచి భద్రతాబలగాలపై కాల్పులకు దిగింది. మావోయిస్టులు మోటార్ లాంచర్లను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కమలోచన్ కాశ్యప్ ఆదివారం చెప్పారు. 15 మృత దేహాలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో 30 మంది గాయపడినట్లు, 21 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తెలిపారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై మావోయిస్టుల దాడికి సంబంధించిన ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ స్పందించారు. మావోయిస్టుల‌ ప‌లువురు భ‌ద్ర‌తాసిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర మ‌నోవేద‌నకు గురిచేసిందన్నారు. అమ‌రులైన భ‌ద్ర‌తా సిబ్బంది కుటుంబ‌స‌భ్యుల‌కు ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. అమ‌ర జ‌వాన్ల ప్రాణ త్యాగాల‌ను దేశం ఎప్ప‌టికీ మ‌రువ‌ద‌ని పేర్కొన్నారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై న‌క్స‌ల్స్ దాడి ఘ‌ట‌న విచార‌క‌ర‌మ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేష్ భ‌గేల్ చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అసోంలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న కేంద్ర‌మంత్రి హోంమంత్రి అమిత్ షా త‌న‌కు ఫోన్ చేశార‌ని, ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించ‌డం కోసం సీఆర్‌పీఎఫ్ డీజీని పంపుతున్న‌ట్లు చెప్పార‌ని  వెల్ల‌డించారు.

తాను కూడా ఈ సాయంత్రానికి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. న‌క్స‌ల్స్‌కు, భ‌ద్ర‌తాసిబ్బందికి మ‌ధ్య దాదాపు నాలుగు గంట‌ల‌పాటు కాల్పులు జ‌రిగాయ‌ని, ఈ కాల్పుల్లో న‌క్స‌ల్స్ వైపు కూడా భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఏదేమైనా భ‌ద్రతాసిబ్బంది బ‌లిదానాలు మాత్రం వృథా కాబోవని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 2 న సుమారు 2,000 మంది సాయుధ దళాలు అడవుల్లోకి గాలింపు చర్యలకు వెళ్లి, తిరిగి  వస్తుండగా,మావోయిస్టులు చుట్టూ ముట్టి ఈ దాడికి పాల్పడిన్నట్లు తెలుస్తున్నది. అనేక దాడులకు నాయకత్వం వహించిన కిరాతక ఏరియా కమాండర్ హిదమా సారధ్యంలో ఈ దాడి జరిగిన్నట్లు భావిస్తున్నారు. ఒక మహిళా మావోతో పాటు మొత్తం 10 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఆదివారం కూడా ఇరు వర్గాల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.