ఆదివారం కూడా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

రాష్ట్రంలో 45 ఏళ్లలోపున్న వారికి టీకా వేసే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఆదివారం కూడా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పనిచేస్తాయని ప్రజాఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సెల్వ వినాయగం తెలిపారు. రాష్ట్రంలో జనవరి 16వ తేది నుంచి టీకా వేసే ప్రక్రియ జరుగుతోంది. తొలివిడతగా ఆరోగ్యశాఖ సిబ్బంది, వాలంటీర్లను టీకాలు వేశారు. రెండవ విడతగా 45 ఏళ్లకు పైబడిన వారు, 60 ఏళ్ల వృద్ధులకు వేస్తున్నారు. ప్రస్తుతం 6,217 ప్రభుత్వ, 1,916 ప్రైవేటు కేంద్రాల్లో 30.31 లక్షల మందికి టీకాలు వేశారు.  
 
ఈ విషయమై ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే టీకాలు వేస్తు న్నామని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆదివారాల్లో కూడా టీకా వేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
 
 కాగా, ఇటీవల వరుసగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే, మైసూర్‌, కాలబురిగి, దక్షిణ కన్నడ, ఉడిపి, బీదర్‌, హుబ్లీ-ధార్వాడ్‌ సహా బెంగళూరు అర్బన్‌, రూరల్‌ తదితర జిల్లాల పరిధిలో ఆంక్షలు విధించింది.
 
ఆయా జిల్లాలోని పబ్‌లు, బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లలో కస్టమర్ల సంఖ్య 50శాతానికి మంచరాదని ఆదేశించింది. షాపింగ్‌ మాల్స్‌, క్లోడ్‌ మార్కెట్లు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం నిబంధనలు అమలు చేయడంతో పాటు ఖచ్చితంగా హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. మరో వైపు ప్రభుత్వం 6-9 తరగతులను నిలిపి వేసింది. జిమ్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ మూసివేసి ఉండనున్నాయి. అలాగే ధర్నాలు, ర్యాలీలు నిషేధించారు. నిన్న ఒకే రోజు 4,991 కొవిడ్‌-19 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 10,06,229కు పెరిగాయి.