ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 

అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.  జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

 ‘గత ఏడాది ఆగిన చోటు నుండి ఎన్నికల ప్రకియ కొనసాగుతుంది’ అని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నూతన ఎస్‌ఇసిగా నీలం సాహ్ని గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిషత్‌ ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించారు. గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా జరిపిన భేటీలోనూ, అనంతరం జిల్లా కలెక్టర్లతో నిర్వహంచిన వీడియోకాన్పరెన్స్‌లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కలెక్టరు చెప్పారు.

 అయితే, పరిఫత్‌ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌ ఒకటి రెండు, మూడు రోజల్లో హైకోర్టులో విచారణకు రానుండటంతో ఆ తరువాత ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, అనూహ్యంగా గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నోటిఫికేషన్‌ విడుదలైంది. 

కోర్టు కేసులున్న స్థానాలకు ఎన్నికలు నిర్వహింబచోమని, గుర్తింపు పార్టీ అభ్యర్థి ఎవరైనా చనిపోతే ఆ స్థానానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంతకుమందు గుంటూరులో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. 

ఎనిమిది రోజుల్లో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్‌ఇసిని కోరుతామని జగన్చె ప్పారు. ఆ తరువాత కాసేపటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎస్‌ఇసి నీలం సాహ్నిని కలిసి ఎన్నికల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు.