
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు బుధవారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సందర్భంలో పాకిస్థాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
జూన్ 20 వరకు భారత్ నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు పాక్ మీడియా చెప్పింది. చక్కెర దిగుమతిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్ పత్తి దిగుబడి భారీగా తగ్గిపోవడంతో భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.అయితే దీనిపై భారత్ అధికారికంగా స్పందించలేదు.
2019లో జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత భారత్తో వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ నిలిపేసింది. కానీ గత నెలలో ఊహించని విధంగా రెండు దేశాలు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడతామన్న ప్రకటనను జారీ చేశాయి. ఇక ఈ మధ్యే రెండు దేశాల ప్రధాన మంత్రులు కూడా లేఖలు రాసుకోవడం గమనార్హం.
More Stories
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
ఎయిర్ ఇండియా బాధితులకు అదనంగా రూ.25 లక్షలు
ఎస్బిఐ వడ్డీ రేట్లు అర శాతం తగ్గింపు