మొజాంబిక్‌లో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు బీభ‌త్సం 

ఆఫ్రికా దేశ‌మైన‌ మొజాంబిక్‌లో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు బీభ‌త్సం సృష్టించారు. ప‌ల్మా ప‌ట్ట‌ణాన్ని సీజ్ చేశారు. ఆ న‌గ‌రంపై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో జ‌నం మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. 

ఓ హోట‌ల్ దిగ్బంధం నుంచి ప‌రారీ అవుతున్న‌వారిలో ఏడుగురు హ‌త‌మైన‌ట్లు స్థానికులు తెలిపారు. వంద‌ల సంఖ్య‌లో స్థానికులు, విదేశీయుల‌ను ర‌క్షించిన‌ట్లు అధికారులు చెప్పారు. బుధ‌వారం నుంచి ప‌ల్మా న‌గ‌రంలో ఇస్లామిక్ మిలిటెంట్లు భీక‌ర దాడులు చేస్తున్నారు.

 ఫ్రాన్స్‌కు చెందిన టోట‌ల్ ఇంధ‌న సంస్థ .. ప‌ల్మా స‌మీపంలో ఉన్న‌ది. మిలిటెంట్ల దాడితో సుమారు వంద మంది అమ‌రులా ప‌ల్మా హోట‌ల్‌లో త‌ల‌దాచుకున్నారు. తమ కార్యకలాపాలను నిలిపి వేయవలసి రావడంతో భారీ నష్టాలకు గురవుతున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. 

పోర్టు ప‌ట్ట‌ణ‌మైన ప‌ల్మా నుంచి జ‌నం త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కార్గో వెస‌ల్స్‌, ప్యాసింజ‌ర్ షిప్‌లు, ట‌గ్స్‌, రిక్రియేష‌న‌ల్ బోట్ల ద్వారా తప్పించుకునేందుకు జ‌నం ప్ర‌య‌త్నించారు. ప‌ల్మా నుంచి 1400 మందితో బ‌య‌లుదేరిన ఓ బోటు పెంబా ప‌ట్ట‌ణానికి చెరుకున్న‌ట్లు ఓ అధికారి చెప్పారు.

 మిలి‌టెంట్ల దాడితో ప‌ల్మా న‌గ‌రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 35 వేల మంది ప‌రారీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ ఇంధ‌న కంపెనీని టార్గెట్ చేస్తూ మిలిటెంట్ల ప‌ల్మా న‌గ‌రంపై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. 

అయితే ఆ కంపెనీకి మాత్రం మొజాంబిక్ ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. అల్ సున్నా వా జ‌మా మిలిటెంట్ సంస్థ ఈ దాడుల‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. 

వీధులలో మృతదేహాలు పడి ఉండడం, భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తున్నవారిపై, భవనాలపై విచక్షణారహితంగా కాపులు జరపడం చూసిన్నట్లు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. 2017నుండి ఈ దేశం ఉత్తర భాగం సాయుధ తిరుగుబాటుతో అల్లకల్లోలంగా మారుతున్నది. 

ఇస్లామిస్ట్ స్టేట్ కు చెందిన మిలిటెంట్లు జరుపుతున్న దాడులలో ఇప్పటికి 2,500 మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.