రాసలీలల వివాదంలో ఇద్దరు మంత్రులపై వేటు

ఆస్ట్రేలియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన రాసలీలల అంశంలో ఇద్దరు మంత్రులపై వేటు పడింది. పార్లమెంట్ భవనం ఆవరణలో సిబ్బంది రాసలీలలు చేయడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై వేటు పడింది. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ శాఖ మంత్రి లిండా రేనాలడ్స్, అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టల్‌పై వేటు వేస్తూ  ప్రధాని స్కాట్ మారిసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని తన మంత్రివర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 

దేశంలోని మ‌హిళ‌లను ఆకట్టుకునేందుకు స్కాట్ కొత్త ప్ర‌ణాళిక వేసిన‌ట్లు స‌మాచారం. దీని కోసం ఆయ‌న టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. మ‌హిళల‌ ర‌క్ష‌ణ, ఆర్థిక స్వాలంబ‌న‌ పెంచేందుకు కొత్త వ్యూహాన్ని ఆ టాస్క్‌పోర్స్ వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం ర‌క్ష‌ణ మంత్రి కార్యాల‌యంలో ఆ శాఖ ఉద్యోగినిపై లైంగిక దాడి జ‌రిగింది. పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్న ఉన్న‌త స్థాయి ఉద్యోగే ఆ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. హిగ్గిన్స్ అనే మాజీ ఉద్యోగి చేసిన ఆరోప‌ణ‌తో దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి.

అయితే ఇటీవ‌ల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ర‌క్ష‌ణ‌మంత్రి లిండా ఆ ఘ‌ట‌న ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ప్ర‌భుత్వానికి మ‌చ్చ తెచ్చిన ఈ సంఘ‌ట‌న‌తో ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ క్యాబినెట్‌లో భారీ మార్పుల‌కు పూనుకున్న‌ట్లు తెలుస్తోంది. అటార్నీ జ‌న‌ర‌ల్ పోర్ట‌ర్ 16 ఏళ్ల క్రితం త‌న‌ను రేప్ చేశార‌ని ఆరోప‌ణ‌లు చేసిన ఓ మ‌హిళ కొన్ని రోజుల క్రితం మృతిచెందింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో పోర్ట‌ర్‌ను అటార్నీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు.