
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొవిడ్ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారంతా ముందస్తు జాగ్రత్తగా కొవిడ్ టెస్టు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,99,042 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది.
వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృతి చెందగా, మృతుల సంఖ్య 1,647కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా ఉందని, రికవరీ రేటు 98.41శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,151 యాక్టివ్ కేసులున్నాయని, 1,285 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి.
More Stories
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మహేందర్రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్
బనకచర్ల వివాదంపై త్వరలో ఇద్దరు సీఎంలతో భేటీ