
కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019 సంవత్సరానికి గాను ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ అవార్డు సొంతం చేసుకుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు.
జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకు గానూ రాజు సుందరం ఎంపికయ్యారు. ఉత్తమ ప్రొడక్షన్ హౌస్ విభాగంలో మహర్షి సినిమా ఎంపికైంది.
జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపికయ్యారు. మణికర్ణిక సినిమాలో నటనకు గానూ ఆమెను ఎంపిక చేశారు. ఇక ఉత్తమ నటుడు కేటగరీలో మనోజ్ బాజ్‌పాయ్, ధనుష్‌ను సంయుక్తంగా ప్రకటించారు.
జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా సూపర్ డిలాక్స్‌లో నటనకు గానూ విజయ సేతుపతి ఎంపికయ్యారు. ఉత్తమ హిందీ చిత్రంగా చిచోరే నిలిచాయి. జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా కస్తూరి ఎంపికైంది. ఇక ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘జల్లికట్టు’ (మలయాళం) చిత్రం దక్కించుకుంది.
కరోనా వల్ల గత ఏడాది ఈ అవార్డులను ప్రకటించలేదు. బెస్ట్ నాన్-ఫీచర్ ఫిల్మ్ అవార్డు యాన్ ఇంజనీర్డ్ డ్రీమ్‌కు దక్కింది. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్‌గా సిక్కిం రాష్ట్రం గెలుచుకున్నది. అసురన్ తీసిన వెట్రి మారన్ కు బెస్ట్ డైరక్టర్ అవార్డు దక్కింది.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి