పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి  వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి,  బీజేపీ అభ్యర్థి ఎన్  రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. 

వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో ఈ బిజెపిగా రామచంద్రరావు  అభ్యర్థి ఈ సీట్ గెల్చుకున్నారు. 

ప్రతి రౌండ్ లో ఆమెకు రామచంద్రరావు గట్టి పోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య తేడా చాలా తక్కువగా ఉంటూ వచ్చింది. మొత్తం పోలైన ఓట్లలో సుమారు 70 శాతం అధికార పక్షానికి వ్యతిరేకంగా నమోదైనా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతతో, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఆమె గెలుపొందారు. 

వామపక్షాలు బలపరచిన నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిల రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువగా వాణీదేవికి రావడం చూస్తుంటే వారు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకు వచ్చి, బిజెపి అభ్యర్థిని ఓడించడం కోసమే పోటీచేసిన్నట్లు స్పష్టం అవుతుంది. వారిద్దరూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేక పోయారు.