బీమాలో ఎఫ్‌డీఐలను 74 శాతానికి పెంచే బిల్లుకు ఆమోదం

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వాయిస్ ఓటుతో బిల్లు ఆమోదించబడింది. 2021 బీమా (సవరణ) బిల్లుపై చర్చకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. 

బీమా రంగం దేశంలో మరింత చొచ్చుకుపోయే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడులు దేశీయ దీర్ఘకాలిక వనరులను భర్తీ చేస్తాయని ఆమె  చెప్పారు. సెక్టార్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ వాటాదారులతో సవివరమైన సంప్రదింపులు జరిపిన తరువాత ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నామని సీతారామన్ తెలిపారు. 

ఈ నెల ప్రారంభంలో బీమా చట్టంలో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నది. ఈ బిల్లు ప్రకారం, బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లు, కీ మేనేజ్‌మెంట్ వ్యక్తులు భారతదేశంలో నివసించే వారు ఉంటారు. కనీసం 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్ర డైరెక్టర్లు రెసిడెంట్‌ ఇండియన్స్‌ ఉంటారు. నిర్దిష్ట శాతం లాభాలను సాధారణ రిజర్వ్‌గా ఉంచారు. 

బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రభుత్వం చివరిసారిగా 2015 లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. ఎఫ్‌డీఐల పెరుగుదల దేశంలో జీవిత బీమా ప్రవేశాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడింది. జీడీపీ శాతంగా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం దేశంలో 3.6 శాతం, ప్రపంచ సగటు 7.13 శాతం కంటే తక్కువగా ఉన్నది. 

సాధారణ బీమా విషయంలో ఇది జీడీపీలో 0.94 శాతంగా ఉన్నది. ప్రపంచ సగటుతో పోలిస్తే 2.88 శాతం. “పరిమితిని పెంచడం అంటే అన్ని కంపెనీల్లో ఆ స్థాయికి ఆటోమేటిక్ విదేశీ పెట్టుబడులు పెట్టడం కాదు. ప్రతి సంస్థ తమకు తాము డబ్బును కోరుకుంటున్నారా? ఏ మేరకు అనేది వారు నిర్ణయించుకోవాలి. 

కాబట్టి, ఈ ఎనేబుల్ సవరణ వారికి కొంత డబ్బు స్వీకరించడానికి అనుమతించడం మాత్రమే. కానీ, 74 శాతం మించకూడదని నిర్మలా సీతారామన్‌ వివరించారు.