ఐక్యరాజ్యసమితిలో జరిగే సంస్కరణలకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని, యూఎన్‌లో భద్రతా మండలిలో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా మార్చేందుకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డార్టీ పాచికో ప్రకటించారు.
ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎంపీలను ఉద్దేశించి ప్రసగిస్తూ పోర్చుగల్, భారత్ మద్య ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య 500 ఏళ్ల నాటి బంధం ఉందని, ఒకరికి ఒకరు బాగా తెలుసు అని, కేవలం మిత్ర దేశాలు మాత్రమే కాదని, మనం సోదరుల్లా ఉన్నామని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్‌ది అని పాచికో కొనియాడారు. అన్ని స్థాయిల్లోనూ.. స్థానిక నుంచి జాతీయం వరకు.. మహిళలు, యువకులతో దేశం సమగ్రంగా కనిపిస్తోందని డార్టీ ప్రశంసించారు. ప్రతి ఒక్కరి రాజకీయ, మతపరమైన భావాలకు భారత్ గౌరవం ఇస్తుందని ఆయన చెప్పారు.
గత 74 ఏళ్లలో.. భాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడిందని, ఇప్పుడు మేం 75వ స్వాతంత్య్ర సంబరాలు నిర్వహించుకుంటున్నామని, పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ దీనికి సాక్ష్యమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఐపీయూ అధ్యక్షుడిగా మీరు.. అత్యంత క్లిష్ట సమయంలో బాధ్యతలు స్వీకరించారని అంటూ అభినందించారు.
స్పానిష్ ఫ్లూ తర్వాత కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడిందని, దీని వల్ల అన్ని దేశాల ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ప్రభావం పడనున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రధాని మోదీతో ఐపీయూ అధ్యక్షుడు డార్టీ పాచికో భేటీ అయ్యారు. సెంట్రల్ హాల్‌లో వాళ్లు కలుసుకున్నారు. 1889లో ఐపీయూ ఏర్పడింది. దీంతో 179 సభ్య దేశాలు ఉన్నాయి.
More Stories
పెళ్లి కాని ప్రతి మహిళా బజారు సరుకు!
ప్రతీకార దాడులు తప్పువని ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక
ఫిజిక్స్‌లో ఇద్దరికి నోబెల్ పురస్కారం