తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఐ-కోర్ పోంజి స్కామ్ కేసులో ఆయనను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారంలోగా కోల్‌కతా సీజీవో కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాయాలనికి రావాలని సీబీఐ ఆదేశించినట్టు సమాచారం.
ఐ-కోర్ కంపెనీ ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలకు పార్థ చటర్జీ హాజరైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో రిటర్నులు వస్తాయంటూ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసి మోసిగించినట్టు ఐ-కోర్ మీద ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని మంత్రి పార్థ చటర్జీ పేర్కొన్నారు.
‘‘నన్ను పిలిస్తే, తప్పకుండా వెళ్తాను. ఓ మంత్రిగా నేను ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. రాజకీయాల్లోకి చేరేందుకు నేను ఎంతో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టా వచ్చానన్న సంగతి గుర్తుచేసుకుంటే మంచిది. ధనం మీద నాకు ఎలాంటి వ్యామోహమూ లేదు…’’ అని పేర్కొన్నారు.
శారద, రోజ్‌వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీల మాదిరిగానే.. ఐ-కోర్ కూడా అనేక తప్పుడు పథకాలు ప్రచారం చేసి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

More Stories
ఉక్రెయిన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత.. భారత్ నుంచి పెట్రోల్
రికార్డు స్థాయిలో జూన్ లో రూ. 1.94 లక్షల కోట్ల జీఎస్టీ
వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ తో సైబర్ నేరాలు?.. కేంద్రం బ్రేకులు