కాశ్మీర్ విద్యార్థులకు పాక్ లో చదువు పేరుతో ఉగ్రవాదం!

కాశ్మీరీ విద్యార్థులకు ఉగ్రవాదంవైపు ఆకర్షించే ఎత్తుగడలతో భాగంగా వారికి  ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ కోర్సులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నది.  జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదంపై నిధులు సమకూరుతున్న అంశంపై  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ) లోతుగా డ్యార్పాతు చేస్తున్నప్పుడు ఈ అంశం వెల్లడైనది. 

ఫిబ్రవరి 2018 లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్లో, పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరించే ఒక తరం వైద్యులను సిద్ధం చేయడానికి కాశ్మీర్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులు, హురియత్,  పాకిస్తాన్ పాలకుల  త్రిభుజాకార కుమ్మక్కు ఉందని పేర్కొంది.
హాక్ సయ్యద్ అలీ షా గీలానీ, మీర్వైజ్ ఉమర్ ఫారూక్ వంటి హరియత్ నేతలు స్థానికంగా గల యువ విద్యార్థులను ప్రోత్సహించి పాకిస్థాన్ కు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులకు అంటూ పంపుతూ వచ్చారు.
విద్యార్థులకు వీసాల కోసం వారు సిఫారసుల లేఖలను అందించేవారని కూడా అందులో వెల్లడించారు.విద్యార్థి వీసాలపై పాకిస్తాన్‌కు వెళ్తున్న విద్యార్థులు అందరు దాదాపు  వివిధ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, పాకిస్తాన్‌కు వలస వెళ్లిన, చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఉగ్రవాద కుటుంబాలకు చెందిన వీరో, మాజీ మిలిటెంట్ బంధువులో అని నిర్ధారించిన్నట్లు ఎన్‌ఐఏ చార్జిషీట్ తెలిపింది.
మాజీ ఉగ్రవాదుల బంధువులను పంపడంతో పాటు, హురియత్ నాయకుల, వారి అనుచరులు ధనవంతుల నుండి డబ్బు తీసుకొని వారి పిల్లలను వివిధ కోర్సులకు పంపించేవారు. వారి మోడస్ ఆపరేషన్ చాలా సులభం: వారు డబ్బును తమ వద్ద ఉంచుకునేవారు. తమ పలుకుబడి ఉపయోగించి పాకిస్థాన్ కు వీసా సంపాదించేవారు. పాకిస్తాన్ కు పంపిన అభ్యర్థుల కుటుంబ సభ్యులను ఏదో ఒకవిధంగా వేర్పాటువాద భావజాలంతో అనుసంధానించారని ధృవీకరించేవారు. 
 
జమ్మూ కాశ్మీర్‌లోని పూర్వపు రాజకీయ పాలకులకు తెలిసే విద్యార్థులను సిఫారసు చేసే ఈ పద్ధతి చాలా కాలం పాటు కొనసాగింది. చదువును అందించడం పేరుతో యువ మనస్సులను కలుషితం కావించే ఈ దుర్మార్గపు కూటమిని కట్టడి చేయడం కోసం ఫారూఖ్ అబ్దుల్లా, ఆయన  కుమారుడు ఒమర్ అబ్దుల్లా లేదా మెహబూబా ముఫ్తీతో సహా మాజీ ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసినా ఏమీ చేయలేక పోయారు. 

ఉన్నత విద్యను అభ్యసించడానికి పాకిస్తాన్ వెళ్లిన కాశ్మీరీ విద్యార్థులకు, మొదటి రోజు నుండే, వారు వేర్పాటువాద ఎజెండాను అనుసరించే వారు. జమ్మూ, కాశ్మీర్ లో ఢిల్లీ పాలనను వ్యతిరేకించే కుటుంబంలో ఒక భాగంగా ఉండే ప్రతిపాదికపై తమకు ప్రవేశం లభించిందనే అవగాహన వారికి కలిగించేవారు.
మూడు దశాబ్దాలుగా జమ్మూకాశ్మీర్ లో వేర్పాటువాద అజెండాతో పాకిస్థాన్ జరుపుతున్న ప్రచ్ఛన్న పోరులో భాగం కావాలని వారిని ఉత్తేజ పరచేవారు.విద్యను అందించే నెపంతో పాకిస్తాన్ కాశ్మీరీ యువతను సమూలంగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. వారు లోయకు తిరిగి వచ్చిన తరువాత భారతదేశానికి, దాని పాలనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండేవారు.
దాదాపు ఒక సంవత్సరం క్రితం అధికారులకు సమకూరిన డేటా ప్రకారం, జమ్మూ, కాశ్మీర్  నుండి  గరిష్టంగా 700 మంది విద్యార్థులు కాశ్మీర్ పాకిస్తాన్ కాలేజీలలో వేర్వేరు ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్నారు.ఆక్రమిత పాకిస్థాన్ లోని ఏ మెడికల్ కాలేజీ అయినా 1956 లో భారతీయ వైద్య మండలి చట్టం, 1956  ప్రకారం భారత వైద్యమండలి ముందస్తు అనుమతి పొందాలని ఆగష్టు, 2020లో ఉత్తరువు జారీచేశారు. 
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కొత్తగా స్థాపించిన వైద్య కళాశాల నుండి వచ్చిన మొదటి బ్యాచ్ కాశ్మీరీ విద్యార్షులను భారత్ లో ధ్రువీకరణ పరీక్షకు అనుమతించదక పోవడంతో వారు 2017లో పెద్ద ముప్పు ఎదుర్కొన్నారు. దానితో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మెడికల్ కోర్సులు చదువుతున్న కాశ్మీరీ విద్యార్థులు పాకిస్థాన్ లోని ఇతర కళాశాలలకు మారారు. పాక్ ఆక్రమిత కళాశాలల్లో చేరవద్దని 2019లో తిరిగి యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ హెచ్చరించింది. 
 
అదే సంవత్సరం పాక్ ఆక్రమిత కళాశాలలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన కాశ్మీరీ విద్యార్థి హదీయ చిష్టికి జమ్మూ, కాశ్మీర్ హైకోర్టు ఉపశమనం కలిగిస్తూ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగం అయినందున ఆ విద్యార్థి పట్ల సానుభూతి చూపాలని విదేశాంగ శాఖకు సూచించింది. 
ముజ్ఫరాబాద్ నుండి దేశంలోని ఇతర కళాశాలలకు మార్చిన  విద్యార్థులు రెండు, మూడు సంవత్సరాలు కోల్పోయారు, ఎందుకంటే వారు కొత్త ఇనిస్టిట్యూషన్లలో కొత్తగా ప్రవేశం పొందవలసి వచ్చింది. పాకిస్తాన్‌లో తమ వృత్తిపరమైన డిగ్రీలను పూర్తి చేసినప్పటికీ, భారతదేశంలో ఎటువంటి ఉపయోగం ఉండదని, ఇక్కడ వారు తమ వృత్తిని కొనసాగించలేరని కాశ్మీరీ విద్యార్థులు గ్రహించవలసి ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఈ సమస్య తెరపైకి వచ్చింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ, కాశ్మీర్ లో హరియత్ నేతలు తమ కార్యకలాపాలను దాదాపు మూసివేయడంతో పాకిస్థాన్ కళాశాలలకు విద్యార్థులను పంపడం చాలావరకు తగ్గింది. ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరంగా పేరొందిన పాకిస్థాన్ కేవలం 50 శాతం అక్షరాస్యత కలిగి ఉంది, పొరుగు దేశాల విద్యార్థులకు ఉన్నత ప్రొఫెషనల్ కోర్స్ లలో చదువు ఏవిధంగా చెబుతుందో అర్హ్డం చేసుకోలేకపోయారు.